AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dangal star Suhani Bhatnagar: 19 ఏళ్లకే మృతి చెందిన ‘దంగల్‌’ నటి సుహానీ భట్నాగర్‌.. డాక్టర్లకు అంతుచిక్కని ఆ అరుదైన వ్యాధే కారణం!

బాలీవుడ్‌ బ్లాక్‌బాస్టర్‌ మువీ 'దంగల్‌' చూడని వారుండరు. అందులో మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమీర్‌ఖాన్‌ కూతుర్లుగా నటించిన ఇద్దరు బాలనటీమనుల నటన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. వీరిలో బబితా ఫోగట్‌ చిన్ననాటి పాత్ర పోషించిన సుహానీ భట్నాగర్‌ (19) గుర్తుందా? ఆమె శుక్రవారం (ఫిబ్రవరి 16) ఆనారోగ్యంతో మృతి చెందారు. డెర్మాటోమయోసిటిస్ అనే అరుదైన ఇన్‌ఫ్లమేటరీ వ్యాధితో ఢిల్లీలో మరణించారు. రెండు నెలల క్రితం ఈ వ్యాధి లక్షణాలు కనిపించగా..

Dangal star Suhani Bhatnagar: 19 ఏళ్లకే మృతి చెందిన 'దంగల్‌' నటి సుహానీ భట్నాగర్‌.. డాక్టర్లకు అంతుచిక్కని ఆ అరుదైన వ్యాధే కారణం!
Dangal Star Suhani Bhatnagar
Srilakshmi C
|

Updated on: Feb 19, 2024 | 10:18 AM

Share

బాలీవుడ్‌ బ్లాక్‌బాస్టర్‌ మువీ ‘దంగల్‌’ చూడని వారుండరు. అందులో మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమీర్‌ఖాన్‌ కూతుర్లుగా నటించిన ఇద్దరు బాలనటీమనుల నటన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. వీరిలో బబితా ఫోగట్‌ చిన్ననాటి పాత్ర పోషించిన సుహానీ భట్నాగర్‌ (19) గుర్తుందా? ఆమె శుక్రవారం (ఫిబ్రవరి 16) ఆనారోగ్యంతో మృతి చెందారు. డెర్మాటోమయోసిటిస్ అనే అరుదైన ఇన్‌ఫ్లమేటరీ వ్యాధితో ఢిల్లీలో మరణించారు. రెండు నెలల క్రితం ఈ వ్యాధి లక్షణాలు కనిపించగా.. 10 రోజుల క్రితమే ఆమెకు వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో సుహానీ భట్నాగర్‌ని ఆమె కుటుంబ సభ్యలు ఫిబ్రవరి 7వ తేదీన ఢిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రిల్లో చేర్పించారు. తీవ్ర అనారోగ్యానికి గురై ఫిబ్రవరి 16న మరణించారు. ‘2 నెలల క్రితం సుహానీ చేతులపై ఎర్రటి మచ్చలు ఏర్పడ్డాయి. అనేక ఆస్పత్రుల్లో చూపించాం. కానీ ఎక్కడా వ్యాధి నిర్ధారణ కాలేదు. చివరికి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. ఇన్‌ఫెక్షన్‌ వల్ల ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందించారు. అయినా ఫలితం దక్కలేదని’ కుమార్తె వ్యాధి గురించి సుహానీ తల్లి పూజ భట్నాగర్ వివరించి బాధపడ్డారు.

బెంగుళూరులోని సక్రా వరల్డ్ హాస్పిటల్‌లో సీనియర్ కన్సల్టెంట్ – రుమటాలజీ డాక్టర్ శ్వేతా సింఘై మాట్లాడుతూ.. డెర్మాటోమయోసిటిస్ అనేది వాపు, చర్మంపై దద్దుర్లు కలిగించే అరుదైన వ్యాధి. ఇది ఏ వయసు వారికైనా సంభవించవచ్చు. సాధారణంగా ఈ వ్యాధి 50 నుంచి 70 యేళ్ల వారికి వస్తుంది. డెర్మాటోమయోసిటిస్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయ్యే అవకాశం పురుషుల కంటే మహిళల్లో రెండింతలు ఎక్కువగా ఉంటుంది. డెర్మాటోమయోసిటిస్‌కు ఖచ్చితమైన కారణం తెలియదు. ఈ వ్యాధి కండరాల వైరల్ ఇన్‌ఫెక్షన్ వల్ల రావచ్చు. శరీర రోగనిరోధక వ్యవస్థ కుంటుపడటం, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, టీకాలు, UV రేడియేషన్, వాయు కాలుష్యం వంటి వాటితో సహా పలు కారణాలు డెర్మాటోమయోసిటిస్‌కు దారితీస్తాయి. అలాగే కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఉపయోగించే స్టాటిన్స్ వంటి మందుల వినియోగం వల్ల కొన్నిసార్లు ఇది సంభవించవచ్చు. ఇది దాదాపు 30-40% మంది రోగులలో అంతర్లీనంగా ఉంటుంది. హఠాత్తుగా బరువు తగ్గినట్లు అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇది చాలా అరుదైన వ్యాధి. ప్రతి 1 లక్ష జనాభాకు ఇద్దరు, ముగ్గురికి మాత్రమే సంభవిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కేవలం ఐదు నుంచి ఆరు మంది మాత్రమే ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ అరుదైన వ్యాధితో బాధపడుతున్న వ్యక్తుల్లో లూపస్ లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి బంధన కణజాల రుగ్మతలు కనిపిస్తాయి.

లక్షణాలు – చికిత్స

డెర్మాటోమియోసిటిస్ అనేది అసాధారణమైన తాపజనక వ్యాధి. ఇది కండరాల బలహీనత, చర్మంపై దద్దుర్లు కలిగిస్తుంది. భుజాలు, చేతులు, తుంటి, తొడలు, మెడ కండరాలు అత్యంత బలహీనంగా మారుతాయి. ఈ వ్యాధి వచ్చిన వారు చేతులను భుజం పైకి లేపలేకపోవడం, కుర్చీ లేదా నేలపై కూర్చున్న స్థానం నుంచి పైకి లేవలేకపోవడం కూడా కష్టమవుతుంది. పర్పుల్ రంగులో దద్దుర్లు.. కళ్ళు, బుగ్గలు, ఛాతీ ముందు లేదా పైభాగంలో కనిపిస్తాయి. కీళ్ల నొప్పులు, వాపులు, గుండె, ఊపిరితిత్తుల కండరాల కణజాలాల వాపు, చర్మం-కండరాలకు సరఫరా చేసే రక్తనాళాల్లో వాపు ఉండవచ్చు. సమయానికి గుర్తించి వైద్యం అందించకపోతే ఇది శ్వాసక్రియ కండరాలను కూడా ప్రభావితం చేస్తుంది. ఫలితంగా మింగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి తలెత్తుతుంది. రోగి CPK, ANA పరీక్షలు, PET స్కాన్ వంటి వాటి ద్వారా నిర్ధారించవచ్చు. డెర్మాటోమైయోసిటిస్‌కు చికిత్స లేనప్పటికీ, మందులు, శారీరక చికిత్స, వ్యాయామం, సూర్యరశ్మిని నివారించడం, సన్‌స్క్రీన్‌లను ఉపయోగించడం, ఫోటోప్రొటెక్టివ్ దుస్తులు ధరించడం, హీట్ థెరపీ, తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా నయం చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.