Thalapathy Vijay: దళపతి విజయ్ పార్టీ పేరులో మార్పు.. కారణం ఏంటో తెల్సా.?
రాజకీయాల్లో దళపతి విజయ్ స్పీడ్ పెంచుతున్నారు. ఇటీవల పార్టీ ప్రకటించిన విజయ్.. ఇవాళ తొలి సమావేశం నిర్వహిస్తుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
రాజకీయాల్లో దళపతి విజయ్ స్పీడ్ పెంచుతున్నారు. ఇటీవల పార్టీ ప్రకటించిన విజయ్.. ఇవాళ తొలి సమావేశం నిర్వహిస్తుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఇటీవలే పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా ప్రచారంలో ఉన్న వార్తలను నిజం చేస్తూ.. ఫిబ్రవరి 2న తమిళగ వెట్రి కళగం అనే పేరుతో సొంత రాజకీయ పార్టీని ప్రకటించారు విజయ్. ఆల్రెడీ కమిటైన రెండు సినిమాలను పూర్తి చేసి, ఆ తర్వాత పూర్తిగా ప్రజాసేవకే అంకితం కాబోతున్నట్లు వెల్లడించారు. ఈ విషయాలను సోషల్ మీడియా వేదికగా స్వయంగా ఆయనే ప్రకటించారు. పార్టీ ప్రకటన తర్వాత కాస్త సైలెంట్‌గా ఉన్న విజయ్.. ప్రస్తుతం పొలిటికల్‌గా స్పీడ్ పెంచుతున్నారు. ప్రకటన అనంతరం ఇన్నాళ్లు మౌనంగా ఉన్న విజయ్.. తాజాగా స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది. దానిలో భాగంగా.. ఇవాళ పార్టీ తొలి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. చెన్నై శివారులోని పణయూర్‌లోని పార్టీ కార్యాలయాన్ని వేదికగా ఫిక్స్ చేశారు.
పార్టీ జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలతో విజయ్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు, బూత్ కమిటీల ఏర్పాటులపై కీలక చర్చించనున్నారు. అయితే.. విజయ్ దూకుడు పెంచడంతో ప్రధాన పార్టీల్లో అలజడి మొదలైనట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే.. తమిళగ వెట్రి కళగం పార్టీ పేరులో స్వల్ప మార్పు చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ పేరులో అదనంగా ‘క్’ అనే అక్షరాన్ని చేర్చబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం విజయ్ పార్టీని టీవీకే అని పిలుస్తుండగా అదే పేరుతో తమిళనాడులో ఉన్న కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. దాంతో.. విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం పేరులో ‘క్’ అనే అక్షరాన్ని కలపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దానిలో భాగంగా.. తమిళగ వెట్రిక్ కళగం అని పిలవాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయట. ఏదేమైనా.. పార్టీ పేరులో మార్పులు సంగతి పక్కనబెడితే.. తొలిసారి జిల్లా అధ్యక్షులు, ముఖ్య నేతలతో సమావేశం కాబోతున్న విజయ్ దళపతి.. రాజకీయంగా ఏం చర్చిస్తారు?.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు?.. అనేది రాజకీయ వర్గాలతోపాటు.. సినీ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.
మరోవైపు ‘LCU’లో దళపతి విజయ్ ఐరన్ మ్యాన్ లాంటివాడని ఇటీవల ‘లియో’ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రజాసేవ నుంచి కాస్త విరామం తీసుకుని.. విజయ్ తనకు ఛాన్స్ ఇస్తే.. కచ్చితంగా ‘లియో’ సీక్వెల్ ఉంటుందని లోకేష్ వెల్లడించారు.