మరో పొలిటికల్ స్టోరీతో వస్తున్న రానా..!

మరో పొలిటికల్ స్టోరీతో వస్తున్న రానా..!

‘లీడర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు దగ్గుబాటి రానా. ఆ సినిమాలో ముఖ్యమంత్రిగా మంచి నటన కనబరిచాడు రానా. ఆ తర్వాత రీసెంట్ గా ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా చేశాడు. డిఫరెంట్ పొలిటికల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ చిత్రానికి తేజ దర్శకుడు. ఇప్పుడు మరోసారి రానా అదే పొలిటికల్ కాన్సెప్ట్ చేయబోతున్నాడట. ‘నీది నాది ఒకటే కథ’ ఫేమ్ వేణు […]

Ravi Kiran

|

Mar 22, 2019 | 6:51 PM

‘లీడర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు దగ్గుబాటి రానా. ఆ సినిమాలో ముఖ్యమంత్రిగా మంచి నటన కనబరిచాడు రానా. ఆ తర్వాత రీసెంట్ గా ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా చేశాడు. డిఫరెంట్ పొలిటికల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ చిత్రానికి తేజ దర్శకుడు.

ఇప్పుడు మరోసారి రానా అదే పొలిటికల్ కాన్సెప్ట్ చేయబోతున్నాడట. ‘నీది నాది ఒకటే కథ’ ఫేమ్ వేణు ఉడుగుల దీనికి దర్శకత్వం వహించనున్నాడు. పంచాయితీ రాజ్ వార్డ్ మెంబెర్ కు సంబంధించిన కథతో ఈ సినిమా తెరకెక్కనుందట. ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం రానా చేస్తున్న సినిమాలు పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందట.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu