రేస్ నుంచి తప్పుకున్న ‘దేవి 2’

రేస్ నుంచి తప్పుకున్న ‘దేవి 2’

ప్రభుదేవా, తమన్నా జంటగా నటించిన చిత్రం ‘దేవి’(తెలుగులో ‘అభినేత్రి’). ఈ సినిమాకు విజయ్ దర్శకుడు. ఇది ఇలా ఉంటే దీనికి సీక్వెల్(దేవి 2) రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 12 న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారకంగా కూడా ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను నెల రోజులు లేట్ గా రిలీజ్ చేయనుందట చిత్ర యూనిట్. ఈ […]

Ravi Kiran

|

Mar 22, 2019 | 6:21 PM

ప్రభుదేవా, తమన్నా జంటగా నటించిన చిత్రం ‘దేవి’(తెలుగులో ‘అభినేత్రి’). ఈ సినిమాకు విజయ్ దర్శకుడు. ఇది ఇలా ఉంటే దీనికి సీక్వెల్(దేవి 2) రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 12 న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారకంగా కూడా ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను నెల రోజులు లేట్ గా రిలీజ్ చేయనుందట చిత్ర యూనిట్. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు విజయ్ వెల్లడించారు. దీనికి అసలు కారణం.. ఆయన దర్శకత్వం వహిస్తున్న ‘వాచ్ మెన్’ కూడా అదే రోజున రిలీజ్ కానుంది. అందుచేత రెండు సినిమాలు క్లాష్ అవడం ఇష్టం లేక పోస్ట్ పోన్ చేశారట. ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ వెర్షన్స్ హక్కుల లావాదేవీలు కూడా ఇంకా పూర్తి కాలేదట. సో ఈ విధంగా చూస్తే సాయి ధరమ్ తేజ్ సోలోగా ఆ రోజు బాక్స్ ఆఫీస్ ముందుకు రానున్నట్లే.. కాగా దేవి 2 ఇంక సమ్మర్ కు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu