ప్రాణంగా ప్రేమించి, పెళ్లాడిన వాడికి ఎందుకు విడాకులు ఇవ్వాల్సి వచ్చింది.? అత్యంత సహజంగా కలర్స్ స్వాతి మూవీ టీజర్..
చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోన్న స్వాతి తాజాగా నటిస్తోన్న చిత్రం 'మంత్ ఆఫ్ మధు'. శ్రీకాంత్ నాగోటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్నాడు. సైలెంట్‌గా చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం...
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటి కలర్స్ స్వాతి. యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టి నటిగా ఎదిగింది స్వాతి. ప్రోగ్రామ్‌నే ఇంటి పేరుగా మార్చుకున్న ఈ బ్యూటీ తన నటనతో తెలుగు ప్రేక్షకులకు హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇదిలా ఉంటే చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోన్న స్వాతి తాజాగా నటిస్తోన్న చిత్రం ‘మంత్ ఆఫ్ మధు’. శ్రీకాంత్ నాగోటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్నాడు. సైలెంట్‌గా చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఫైనల్ స్టేజ్‌కి చేరుకుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆసక్తిని పెంచేశాయి.
ఇదిలా ఉంటే తాజాగా చిత్ర యూనిట్ గురువారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. 1.58 నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్ సినిమా కథ ఏంటన్నదానిపై ఓ క్లారిటీ ఇచ్చేసింది. అత్యంత సహజంగా తెరకెక్కించిన సన్నివేశాలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. హీరో తాగుబోతు అని తెలిసినా ఎంతగానో ప్రేమించి వివాహం చేసుకున్న హీరోయిన్ జీవితంలో ఎలాంటి మార్పులు జరిగాయి. చివరికి ఆ జంట ఎందుకు విడిపోవాల్సి వచ్చింది లాంటి విషయాలను దర్శకుడు ఎంతో సహజంగా చెప్పే ప్రయత్నం చేశాడు. టీజర్‌లో నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది.
ఇక డైలాగ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. టీజర్‌లో ఒక్కో డైలాగ్ మెస్మరైజ్ చేస్తోంది. ముఖ్యంగా ఇందులో వచ్చే.. ’20 ఏళ్ల బాధను 20 నిమిషాల్లో చెప్పలేను’. ‘నా ప్రేమ, కోపం, కోరిక ఏదైనా దానిపైనే చూపించాను.. నచ్చలేదు వెళ్లిపోయింది’. ‘పోయింది అండి ఓపిక పోయింది, పోయాకే తెలిసింది ప్రేమకు కూడా ఓపిక పోయిందని’ అని సాగే సంభాషణలను ఆసక్తిని పెంచాయి. ఇంతకీ ఆ జంట మధ్య నెలకొన్న సంఘర్షణ ఏంటి.? సినిమాకు ఎలా ఎండ్ కార్డ్ పడిందన్న విషయాలు తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..