Colors Swathi: సెకండ్ ఇన్నింగ్స్ లో దుకుడు పెంచిన చలాకీ పిల్ల.. వరుస సినిమాలతో బిజీగా కలర్స్ స్వాతి
అందం..చలాకీతనం కలబోసిన ముద్దుగుమ్మ కలర్స్ స్వాతి. ఒకప్పుడు వరుసగా యంగ్ హీరోల సరసన నటించిన సూపర్ హిట్స్ అందుకున్న స్వాతి కెరియర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది.
Colors Swathi: అందం..చలాకీతనం కలబోసిన ముద్దుగుమ్మ కలర్స్ స్వాతి. ఒకప్పుడు వరుసగా యంగ్ హీరోల సరసన నటించి సూపర్ హిట్స్ అందుకున్న స్వాతి కెరియర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది.పెళ్లి తరవాత ఇండోనేషియాలో సెటిల్ అయిన ఈ అమ్మడు ఇప్పుడు మళ్లీ సినిమాల్లో రాణించాలని చూస్తుంది.గతంలో యంగ్ హీరో నిఖిల్ తో కలిసి ఈ ముద్దుగుమ్మ స్వామిరారా, కార్తికేయ వంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నిఖిల్ కార్తికేయ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో స్వాతి నటిస్తుందని వార్తలు షికారు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే దాదాపు 4 ఏళ్ల తరువాత కలర్స్ స్వాతి తిరిగి టాలీవుడ్ కు వచ్చింది. ‘పంచతంత్రం’ అనే సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. పంచతంత్రం అనే సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది స్వాతి. నూతన దర్శకుడు హర్ష పులిపాక ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో కలర్స్ స్వాతితో పాటుగా బ్రహ్మానందం, సముద్రఖని, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, నరేష్ అగస్త్య నటిస్తున్నారు. ఈ సినిమాతోపాటు మరో తెలుగు సినిమాలోనూ స్వాతి నటుస్తున్నట్టు తెలుస్తుంది. పెళ్లి తర్వాత కాస్త బొద్దుగా కనిపించిన స్వాతి.. సినిమాల కోసం మళ్ళీ స్లిమ్ గా మారింది. మరి ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో స్వాతి ఎలా రాణిస్తారో చూడాలి .
మరిన్ని ఇక్కడ చదవండి :