AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Teja 68: నయా మూవీ షూటింగ్ షురూ చేసిన మాస్ రాజా.. ఇంటరెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో దూకుడు మీద ఉన్నాడు. చాలా కాలాంతర్వత క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు రవితేజ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

Ravi Teja 68: నయా మూవీ షూటింగ్ షురూ చేసిన మాస్ రాజా.. ఇంటరెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్
Rt68
Rajeev Rayala
|

Updated on: Jul 01, 2021 | 11:59 AM

Share

Ravi Teja : మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో దూకుడు మీద ఉన్నాడు. చాలా కాలాం తర్వత క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు రవితేజ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమా తరవాత రమేష్ వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఖిలాడి అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా రానుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఇదిలా ఉంటే మాస్ రాజా తన కొత్త సినిమాను కూడా మొదలు పెట్టేసాడు శరత్ మండవ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు రవితేజ

రవితేజ కెరియర్ లో 68 వ మూవీగా వస్తుంది ఈ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. #RT68 రెగ్యులర్ షూటింగ్ ఈరోజు ప్రారంభం అయ్యింది. హైదరాబాద్ ల్పోని అల్యుమ్మినియం ఫ్యాక్టరీలో ఈ రోజు (గురువారం ) సినిమా షూటింగ్ మొదలైంది. ఈ మేరకు ఓ ఆసక్తికరమైన పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో రవితేజ కుర్చీపై కూర్చోని ఉండగా.. ఎదురుగా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయం అనే బోర్డు కనిపిస్తుంది. అలానే ఓ ప్రభుత్వ అధికారి ప్రమాణ స్వీకారం చేసిన ఒక పాత లెటర్ ను కూడా ఈ పోస్టర్ లో చూపించారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి: 

Colors Swathi: సెకండ్ ఇన్నింగ్స్ లో దుకుడు పెంచిన చలాకీ పిల్ల.. వరుస సినిమాలతో బిజీగా కలర్స్ స్వాతి

National Doctor’s Day: సాయి పల్లవి.. అజ్మల్ అమీర్‏ సహా నిజ జీవితంలో డాక్టర్స్ అయిన స్టార్స్..

Ravi Babu: అడల్డ్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న రవిబాబు.. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కానున్న క్రష్