RRR Movie Chiranjeevi Voice Over: ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ప్రోమోలో చిరంజీవి వాయిస్ ఉన్నట్టా.. లేనట్టా..?
RRR Movie Chiranjeevi Voice Over: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్' (రౌద్రం రణం రుధిరం) మూవీ గురించి దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు...

RRR Movie Chiranjeevi Voice Over: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ (రౌద్రం రణం రుధిరం) మూవీ గురించి దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాకముందే ప్రేక్షకుల్లో ఎన్నో ఆశలు రేపుతున్నాయి. అయితే ఈ మూవీ మీ ఉహలకు అందకుండా ఉంటుందని చెప్పిన రాజమౌళి.. స్వాతంత్ర్య సమరయోధుల కథలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్డీఆర్ కొమురంభీం పాత్రలో నటిస్తున్నారు.
అయితే ఆర్‌ఆర్‌ఆర్ మూవీ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జక్కన్న బృందం ఈ రిపబ్లిక్‌డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఓ ప్రోమో సిద్దం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆ ప్రోమో వీడియోకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందించనున్నట్లు పుకార్లు షికార్లు అవుతున్నాయి. ఇప్పటికే వైరల్ అవుతున్న ఈ వార్తపై జక్కన్న టీమ్ స్పందించలేదు. ఎలాంటి స్పందన రాకపోవడంతో ఇది నిజమేనని నమ్ముతున్నారు నెటిజన్లు.
అయితే చిరంజీవి వాయిస్ ఓవర్ ఇస్తున్నాడన్న వార్తపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. గతంలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా దేశ భక్తికి సంబంధించింది కాబట్టి కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య స్వచ్ఛమైన స్నేహం గురించి మాత్రమే ఈ సినిమా సాగుతుందని చెప్పారు రాజమౌళి. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇక హీరోయిన్లుగా అలియాభట్ ఓలివియా మోరిస్ నటిస్తున్నారు. తాజాగా కొత్త ప్రోమో కూడా థ్రిల్లింగ్‌గా ఉండబోతోందని గుసగులు వినిపిస్తున్నాయి.
Also Read:
Sohail: హిందీ వెబ్ సీరిస్‌లో హీరోగా బిగ్‌బాస్ ఫేం సోహైల్.. త్వరలో ప్రారంభం కానున్న..
Raviteja: క్రాక్ సినిమాతో సంక్రాంతికి విందు భోజనం.. అభిమానులకు రవితేజ విజ్ఞప్తి..