Sohail: హిందీ వెబ్ సీరిస్‌లో హీరోగా బిగ్‌బాస్ ఫేం సోహైల్.. త్వరలో ప్రారంభం కానున్న..
బిగ్‌బాస్ సీజన్ 4 ఇంట్లో పక్కింటి అతిధిగా అడుగుపెట్టిన సోహైల్ .. తన ప్రవర్తనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. అంతే కాకుండా ఫినాలే రోజున మెగాస్టార్ చిరంజీవి అభిమానాన్ని కూడా పొందాడు ఈ సింగరేణి బిడ్డ.

బిగ్‌బాస్ సీజన్ 4 ఇంట్లో పక్కింటి అతిధిగా అడుగుపెట్టిన సోహైల్ .. తన ప్రవర్తనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. అంతే కాకుండా ఫినాలే రోజున మెగాస్టార్ చిరంజీవి అభిమానాన్ని కూడా పొందాడు ఈ సింగరేణి బిడ్డ. బిగ్‌బాస్ ఫినాలే తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటున్నాడు. ఇప్పటికే జార్జిరెడ్డి నిర్మాత అప్పిరెడ్డి నిర్మిస్తున్న ఓ సినిమాలో సోహైల్ హీరోగా నటించనున్నాడు. ఈ సినిమాకు వి. శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నాడు. తాజాగా నిర్మాత, నటుడు అచ్యుత రామారావు కూడా సోహైల్‌తో మరో సినిమా ప్లాన్ చేసినట్లుగా టాక్. ఇక ఈ సినిమా కంటే ముందు సోహైల్ ఓ హిందీ వెబ్ సిరీస్ చేయబోతున్నట్లుగా సమాచారం. ఇందులో సంజయ్ మిశ్రా కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా టాక్. ఈ వెబ్ సిరీస్‌ను వర్మ దర్శకత్వం వహించనున్నాడు. ఇక ఆ వెబ్ సిరీస్‌కు “మై హూ షోలే” అనే టైటిల్‌ను ఖరారు చేశారట. దాదాపు మూడు నెలలుగా ఈ వెబ్ సిరీస్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుందట. తొందర్లోనే ఈ వెబ్ సిరీస్‌ను ప్రారంభించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.