AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుదీప్‌పై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్

కోలీవుడ్ నటుడు సుదీప్‌ తాజాగా ఇబ్బందుల్లో పడ్డాడు. ఓ ఎస్టేట్ వివాదంలో కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నాడన్న ఆరోపణలతో చిక్కమగళూరులోని జేఎంఎఫ్‌సీ కోర్టు సుదీప్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మే 22లోగా ఆయనను తమ ముందు హాజరు పరచాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. అయితే గతంలో సుదీప్ ‘వారసదార’ అనే టీవీ షోను నిర్వహించాడు. ఇందుకోసం ఓ కాఫీ ప్లాంటేషన్‌ను అద్దెకు తీసుకున్నాడు. ఈ ఎస్టేట్‌ను ఉపయోగించుకునేందుకు 80లక్షల ఒప్పందం కుదుర్చుకున్న సుదీప్ […]

సుదీప్‌పై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 28, 2019 | 12:03 PM

Share

కోలీవుడ్ నటుడు సుదీప్‌ తాజాగా ఇబ్బందుల్లో పడ్డాడు. ఓ ఎస్టేట్ వివాదంలో కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నాడన్న ఆరోపణలతో చిక్కమగళూరులోని జేఎంఎఫ్‌సీ కోర్టు సుదీప్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మే 22లోగా ఆయనను తమ ముందు హాజరు పరచాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.

అయితే గతంలో సుదీప్ ‘వారసదార’ అనే టీవీ షోను నిర్వహించాడు. ఇందుకోసం ఓ కాఫీ ప్లాంటేషన్‌ను అద్దెకు తీసుకున్నాడు. ఈ ఎస్టేట్‌ను ఉపయోగించుకునేందుకు 80లక్షల ఒప్పందం కుదుర్చుకున్న సుదీప్ ముందుగా 50వేలు అడ్వాన్స్ ఇచ్చాడు. మిగిలిన సొమ్మును ఇవ్వకుండా ఎగ్గొట్టారని ఆ ఎస్టేట్ యజమాని దీపక్ పటేల్ ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా షూటింగ్‌లో కాఫీ తోటలను, 1.5కోట్ల విలువైన ఆస్తిని ధ్వంసం చేశారని దీపక్ ఆరోపించారు. ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన డబ్బును ఇవ్వకుండా సుదీప్ తనను మోసం చేశారని 2017లో దీపక్ జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. ఆయన సలహా మేరకు దీపక్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సుదీప్, ఆయన ప్రొడక్షన్ హౌస్ కిచ్చా క్రియేషన్స్‌, డైరక్టర్ మహేశ్‌లపై కేసు నమోదైంది. అయితే ఈ కేసు విచారణ జరిగే సమయంలో ఒక్కసారి కూడా సుదీప్ కోర్టుకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ జారీ చేసింది కోర్టు.

Follow Us
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..