AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: అతని టాలెంట్ చూసి ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి.. కట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్‌లో ఉన్నాడు

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటుడిగా టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్న చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. అలాగే ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. అంతే కాదు ఎంతో మంది నటీనటులను, టెక్నీషియన్స్ ను ఎంకరేజ్ చేశారు.

Chiranjeevi: అతని టాలెంట్ చూసి ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి.. కట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్‌లో ఉన్నాడు
Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Jun 15, 2026 | 8:21 AM

Share

ప్రముఖ దర్శకుడు వి సముద్ర ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను అసౌసియేట్ డైరెక్టర్ గా ఉన్నప్పటి విషయాలను అలాగే డైరెక్టర్ గా చేసినప్పుడు జరిగిన విషయాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి గురించి కూడా అనేక విషయాలు పంచుకున్నారు. ముక్యంగా చిరంజీవి కొత్తవారిని ఎంతగా ఎంకరేజ్ చేస్తారో.. అవకాశాలు ఎలా ఇస్తారో తెలిపారు వి సముద్ర. చిత్రీకరణ సమయపాలన విషయంలో చిరంజీవి క్రమశిక్షణను సముద్ర గారు ప్రత్యేకంగా ప్రస్తావించారు. “ప్రొడక్షన్ అవుట్ డోర్ కి వెళ్ళినప్పుడు, 6:30 గంటలకు యూనిట్ స్టార్ట్ అయ్యి, 7:00 గంటలకు షాట్ తీయాలి. ఎందుకు 8:30, 9:00 దాకా లేట్ చేస్తున్నారు.? నేను రెడీ. 6:30 గంటలకు నేను స్పాట్ లో ఉంటాను” అని చిరంజీవి చెప్పేవారు అని సముద్ర అన్నారు. చిరంజీవి నిర్మాతల గురించి ఆలోచించేవారని, నిర్మాతలను పిలిచి ఈ విషయమై చర్చించేవారని సముద్ర గారు తెలిపారు. తాను ఒక హీరోగా ఉన్నప్పుడు సమయాన్ని వృధా చేయవద్దని చిరంజీవి చెప్పారని ఆయన గుర్తు చేసుకున్నారు.

ఇది కూడా చదవండి : కుర్రాళ్ల ఆల్ టైం ఫేవరెట్ మూవీ.. పెట్టింది రూ.4కోట్లు వచ్చింది రూ. 110కోట్లు.. ఇండస్ట్రీని షేక్ చేసిన చిన్న సినిమా

అలాగే, డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ ను సినీ పరిశ్రమకు పరిచయం చేయడంలో తన పాత్రను సముద్ర గారు వివరించారు. లారెన్స్ చిన్న సినిమాలు చేస్తున్న సమయంలో, ఆయన్ను ఏ. మోహన్ గాంధీ గారికి పరిచయం చేశానని చెప్పారు. కొత్త టాలెంట్ ను పరిచయం చేయాలనే చిరంజీవి గారి ఆలోచనకు అనుగుణంగా, లారెన్స్ ను చిరంజీవి గారికి తీసుకెళ్లి పరిచయం చేశామని తెలిపారు. చిరంజీవి  హిట్లర్ సినిమాలోని ఒక పాటకు సిగ్నేచర్ మూమెంట్ చూపించమని లారెన్స్ ను కోరగా, లారెన్స్ రూపొందించిన మూమెంట్ ను చిరంజీవి గారు సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చేశారని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : ఇంటర్వెల్ సీన్ మార్చేశారు.. కట్ చేస్తే ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టేసింది

లారెన్స్, చిరంజీవి గారికి అప్పటివరకు పరిచయం లేకపోయినా, ఆయన ప్రతిభను గుర్తించి అవకాశం ఇచ్చారని, ఆ తర్వాత లారెన్స్ ఎప్పుడూ వెనుదిరిగి చూడలేదని, ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లో ఉన్నాడని అన్నారు. తనను చిరంజీవి గారికి పరిచయం చేసింది సముద్రనే అని లారెన్స్ ఇప్పటికీ అంటారని సముద్ర తెలిపారు. హిట్లర్ సినిమాలోని కష్టాలకే కన్నీళ్లొస్తే పాట థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో కదిలించిందని, ముఖ్యంగా మహిళలు ఆ పాటకి చాలా ఏడ్చారని, ఆ సినిమా చిరంజీవి గారికి మంచి సెంటిమెంట్ హిట్ ను ఇచ్చిందని ఆయన గుర్తు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఆ డాన్స్ ఏంటి అమ్మడు..! హ్యాపీ రీ రిలీజ్‌లో రచ్చ చేసిన హీరోయిన్.. థియేటర్ దద్దరిల్లిందిగా

Chiranjeevi

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
రోహిత్, అభిషేక్ సాధించిన అరుదైన రికార్డు ఏంటో తెలుసా ?
రోహిత్, అభిషేక్ సాధించిన అరుదైన రికార్డు ఏంటో తెలుసా ?
నాయిస్ బడ్స్ VS102 ప్లస్‌తో అన్‌స్టాపబుల్‌.. ఎందుకంటే
నాయిస్ బడ్స్ VS102 ప్లస్‌తో అన్‌స్టాపబుల్‌.. ఎందుకంటే
ఫ్యామిలీ రైడ్స్‌కి మహీంద్రా XEV 9S 6-సీటర్ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ
ఫ్యామిలీ రైడ్స్‌కి మహీంద్రా XEV 9S 6-సీటర్ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ
సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను కొట్టిచంపిన అత్తింటివారు.. అల్లుడు మృతి
సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను కొట్టిచంపిన అత్తింటివారు.. అల్లుడు మృతి
ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా పేలిన రియాక్టర్.. ఇద్దరు మృతి
ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా పేలిన రియాక్టర్.. ఇద్దరు మృతి
మీరు వేరొకరి రైలు టికెట్‌పై ప్రయాణిస్తే ఏమవుతుందో తెలుసా..?
మీరు వేరొకరి రైలు టికెట్‌పై ప్రయాణిస్తే ఏమవుతుందో తెలుసా..?
ఆగస్టు 22 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థికంగా లాభాలు!
ఆగస్టు 22 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థికంగా లాభాలు!
సింగిల్, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇంటికి పెయింట్ కోసం ఎంత ఖర్చు అవుతుంది
సింగిల్, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇంటికి పెయింట్ కోసం ఎంత ఖర్చు అవుతుంది
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో స్వైన్ ఫ్లూ కలవరం.. ప్రధాన లక్షణాలు ఇవే
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో స్వైన్ ఫ్లూ కలవరం.. ప్రధాన లక్షణాలు ఇవే
మరోసారి క్లారిటీ... తగ్గేదే లే అంటున్న ప్రభాస్‌
మరోసారి క్లారిటీ... తగ్గేదే లే అంటున్న ప్రభాస్‌