Vishwanath: విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన ఆ సినిమాను 25 సార్లు చూసిన సీం కేసీఆర్.. ఇంతకీ ఆ మూవీ ఏంటో తెలుసా.?
సినిమాలను అద్భుత దృశ్య కావ్యాలుగా మలిచి సినిమాకే గౌరవం తెచ్చిన ఘనత కళా తపస్వి విశ్వనాథ్‌ది. తన అసమాన దర్శకత్వ ప్రతిభతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న విశ్వనాథ్ అనంతలోకాలకు వెళ్లిపోయారు. అయితే వారి చిత్రాలతో సమాజంపై వేసిన ముద్ర మాత్రం ఎప్పటికీ చెరిగిపోదు...
సినిమాలను అద్భుత దృశ్య కావ్యాలుగా మలిచి సినిమాకే గౌరవం తెచ్చిన ఘనత కళా తపస్వి విశ్వనాథ్‌ది. తన అసమాన దర్శకత్వ ప్రతిభతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న విశ్వనాథ్ అనంతలోకాలకు వెళ్లిపోయారు. అయితే వారి చిత్రాలతో సమాజంపై వేసిన ముద్ర మాత్రం ఎప్పటికీ చెరిగిపోదు. తెలుగు సినిమా స్థాయిని తొలిసారి ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లిన విశ్వనాథ్‌కు సినిమా ఇండస్ట్రీతో పాటు రాజకీయా నాయకుల్లోనూ వీరాభిమానులు ఉన్నారు. వీరిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒకరు.
విశ్వనాథ్ మరణ విర్త తెలియగానే సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం తెలిపిన విషయం తెలిసిందే. సాధారణ కథలను తన అద్భుతమైన ప్రతిభతో వెండితెర దృశ్యకావ్యంగా మలిచిన అరుదైన దర్శకుడు కే. విశ్వనాథ్ అంటూ కేసీఆర్ తెలిపారు. ఇదిలా ఉంటే విశ్వనాథ్‌పై తనకున్న అభిమానాన్ని ఎన్నో పలుసార్లు చాటుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక 2019లో కేసీఆర్ నేరుగా విశ్‌వనాథ్ ఇంటికి వెళ్లీ మరీ కలిశారు. ఈ సందర్భంగా వీరి మధ్య ఎన్నో సంభాషణలు జరిగాయి.
ఆ సందర్భంలో కేసీఆర్ మాట్లాడుతూ.. తాను బాల్యం నుంచీ విశ్వనాథ్ అభిమానని, ఆయన తీసిన అన్ని సినిమాలను చూశానని చెప్పారు. ఇక శంకరాభరణం చిత్రాన్ని అయితే ఏకంగా 25 సార్లు చూశానని కేసీఆర్ ఆ సమయంలో తెలిపారు. అంతటితో ఆగకుండా విశ్వనాథ్ సినిమా తీస్తే తాను నిర్మాతగా వ్యవహరిస్తానంటూ సీఎమ్ వ్యాఖ్యానించారు. అయితే కేసీఆర్ కోరిక మాత్రం నెరవేరలేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..