Bigg Boss 5 Telugu: హౌస్‌లో మొదలైన కెప్టెన్సీ టాస్క్‌.. కింద పడ్డ షణ్ముఖ్‌..

బిగ్‌బాస్‌ హౌస్‌లో 12వ వారంలో నామినేషన్స్ హీట్ ముగిసింది. ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్‌ మొదలైంది. హౌస్‌ కెప్టెన్‌ అయ్యేందుకు కంటెస్టెంట్లందరూ మరోసారి బరిలోకి దిగారు

Bigg Boss 5 Telugu: హౌస్‌లో మొదలైన కెప్టెన్సీ టాస్క్‌.. కింద పడ్డ షణ్ముఖ్‌..
Follow us
Basha Shek

|

Updated on: Nov 23, 2021 | 2:58 PM

బిగ్‌బాస్‌ హౌస్‌లో 12వ వారంలో నామినేషన్స్ హీట్ ముగిసింది. ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్‌ మొదలైంది. హౌస్‌ కెప్టెన్‌ అయ్యేందుకు కంటెస్టెంట్లందరూ మరోసారి బరిలోకి దిగారు. ఇందులో భాగంగా బిగ్‌బాస్‌ ఈ వారం ‘నియంత మాటే శాసనం’ అనే టాస్క్‌ ఇచ్చాడు. ఏరియాగార్డెన్‌లో ఓ నియంత సింహాసనం(కుర్చీ) ఉంటుంది. దానిప ఎవరైతే ముందు కూర్చొంటారో వాళ్లు ఆ రౌండ్‌ నుంచి సేఫ్‌ అవ్వడంతో పాటు హౌస్‌లో నియంతగా వ్యవహరిస్తారు. ఇక మిగిలిన ఇంటి సభ్యులు వారిని వారు రక్షించుకునేందుకు వివిధ ఛాలెంజ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రతి ఛాలెంజ్‌లో చివరి స్థానంలో నిలిచిన ఇద్దరు ఇంటి సభ్యుల్లో ఒకరిని సేవ్‌ చేయాల్సిందిగా తగిన కారణాలు చెప్పి నియంత కుర్చీలో కూర్చొన్న వారిని ఒప్పించాల్సి ఉంటుంది. అలా సేవ్‌ అయిన వారు కెప్టెన్సీ కంటెండర్లు అవుతారంటూ బిగ్‌బాస్‌ ఈ వారం టాస్క్‌ను రూపొందించాడు.

నవ్వులు పూయించిన సిరి.. ఈ సందర్భంగా కంటెస్టెంట్లు వివిధ టాస్క్‌ల్లో పాల్గొన్నారు. అయితే ఒక టాస్క్‌లో ప్రమాదవశాత్తూ షణ్ముఖ్‌ కింద పడిపోయాడు. ఇక ముందుగా నియంత సింహాసనం ఎక్కిన సిరి ‘ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు.. అమ్మాయిలు వాట్‌ టు డు.. వాట్‌ నాట్‌ టు డు’ అని డైలాగ్‌ చెప్పి అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. ‘నేను కెప్టెన్‌ కావాలనుకుంటున్నా’ అని కాజల్‌ అడగ్గా.. ‘నువ్వు రెండు ఫొటోలు కాల్చేశావు కదా! నువ్వు కెప్టెన్‌ అయితే ఏం చేసేదానివి’ అని శ్రీరామ్‌ చంద్ర ఆమెను ప్రశ్నించాడు. ‘కెప్టెన్‌ కాజల్‌ ఫైరింజన్‌లో కూర్చోదు’ అని కాజల్‌ సమాధానం ఇచ్చింది. ఈ సమాధానం శ్రీరామ్‌కు నచ్చలేదు..‘అర్హత ఉన్న వ్యక్తి మాత్రమే కెప్టెన్‌ బ్యాండ్‌ ధరించాలి’ అంటూ రవిని సేవ్‌ చేశాడు. మరి ఈ కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్క్‌లో ఎవరు విజయం సాధించారు? హౌస్‌ కెప్టెన్‌గా ఎవరు నిలిచారు? తెలుసుకోవాలంటే ఈ వారం ఎపిసోడ్స్‌ను ఫాలో కావాల్సిందే.Also Read:

Priyanka Chopra: కూతురి విడాకుల పై క్లారిటీ ఇచ్చిన ప్రియాంక చోప్రా తల్లి..

Viral Photo: ముద్దులొలికే ఈ చిన్నారికి ఇప్పుడు అబ్బాయిల్లో పిచ్చ ఫాలోయింగ్! ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

Evaru Meelo Koteeswarulu: తారక్‏తో మహేశ్ ముచ్చట్లు మాములుగా లేవుగా.. అదిరిపోయిన ప్రోమో..

రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం