Priyanka Chopra: కూతురి విడాకుల పై క్లారిటీ ఇచ్చిన ప్రియాంక చోప్రా తల్లి..

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన భర్త నుంచి విడిపోతుందా.. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Priyanka Chopra: కూతురి విడాకుల పై క్లారిటీ ఇచ్చిన ప్రియాంక చోప్రా తల్లి..
Pc
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 23, 2021 | 2:40 PM

Priyanka Chopra: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన భర్త నుంచి విడిపోతుందా.. ఇప్పుడు ఇదే వార్త సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రియాంక చోప్రా తనకన్నా దాదాపు 10 ఏళ్ళు చిన్నవాడైన అమెరికా పాప్ సింగర్ నిక్ జోనస్‌ను వివాహమాడిన విషయం తెలిసిందే. అప్పట్లో ప్రియాంక పెళ్లి కూడా పెద్ద చర్చకు దారి తీసింది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు విడిపోతున్నారంటూ వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. దీనికి కారణం ప్రియాంక తన సోషల్ మీడియా ఖాతాలైన ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌, ఫేస్‌బుక్‌ ప్రొఫైల్లో‌ తన పేరు మార్చింది. పెళ్లితర్వాత తన భర్త పేరు నిక్ పేరును తన పేరుతో జత చేసుకున్న పీసీ.. ఇప్పుడు ఈ పేరును తొలగించింది. దాంతో ప్రియాంక – నిక్ విడిపోతున్నారన్న ప్రచారం మరింత జోరందుకుంది. ఈ వార్తలపై ప్రియాంక తల్లి స్పందించింది.

తాజాగా ఆమె న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీసీ – నిక్ విడాకుల పై క్లారిటీ ఇచ్చారు. ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా మాట్లాడుతూ.. ప్రియాంక – నిక్ విడాకులు అంటూ వస్తున్న వార్తలను ఖండించారు. ప్రియాంక- నిక్ విడిపోవడంలేదు అని అవన్నీ పుకార్లు మాత్రమేనని ఆమె అన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలను అభిమానులు నమ్మ వద్దు అని ఆమె కోరారు. 2018లో పెద్దలను ఒప్పించి ఒక్కటైన ప్రియాంక- నిక్ తమ దాంపత్య జీవితాన్ని ఎంతో అన్యోన్యంగా గడుపుతున్నారు. వీరిద్దరి సంబంధించిన ఫోటోలు నిత్యం నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. ఇటీవల జరిగిన దీపావళి వేడుకల్లో ఈ జంట కలిసి చేసిన సందడి జరుపుకున్నారు. ఇక విడాకుల వార్తలపై ప్రియాంక ఎలా స్పందిస్తారో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: ముద్దులొలికే ఈ చిన్నారికి ఇప్పుడు అబ్బాయిల్లో పిచ్చ ఫాలోయింగ్! ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

Evaru Meelo Koteeswarulu: తారక్‏తో మహేశ్ ముచ్చట్లు మాములుగా లేవుగా.. అదిరిపోయిన ప్రోమో..

Pooja Kannan: హీరోయిన్‏గా ఎంట్రీ ఇస్తున్న సాయి పల్లవి చెల్లెలు.. అక్కకు ఏమాత్రం తీసిపోని పూజ కన్నన్.. బ్యూటీఫుల్ ఫోటోస్..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి