AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guess The Actress: తెగ ముద్దొచ్చేస్తోన్న ఈ చిన్నారుల్లో ఒక స్టార్‌ హీరోయిన్‌ ఉంది.. అందానికి కేరాఫ్‌ ఈ బ్యూటీ, ఎవరో గుర్తుపట్టారా?

సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత నెట్టింట గడిపే సమయం పెరిగిపోయింది. కేవలం సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు సైతం సోషల్‌ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. కేవలం సినిమా విశేషాలకే పరిమితం కాకుండా వ్యక్తిగత..

Guess The Actress: తెగ ముద్దొచ్చేస్తోన్న ఈ చిన్నారుల్లో ఒక స్టార్‌ హీరోయిన్‌ ఉంది.. అందానికి కేరాఫ్‌ ఈ బ్యూటీ, ఎవరో గుర్తుపట్టారా?
Narender Vaitla
|

Updated on: Jan 27, 2023 | 10:16 AM

Share

సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత నెట్టింట గడిపే సమయం పెరిగిపోయింది. కేవలం సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు సైతం సోషల్‌ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. కేవలం సినిమా విశేషాలకే పరిమితం కాకుండా వ్యక్తిగత వివరాలను సైతం అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక సోషల్‌ మీడియాలో నిత్యం ఏదో ఒక టాపిక్‌ ట్రెండింగ్‌లో నిలుస్తుంటాయి. అలాంటి వాటి ‘థ్రో బ్యాక్‌’ ఒకటి. చిన్నతనంలో దిగిన ఫొటోలను ఇప్పుడు తిరిగి పోస్ట్ చేయడమే ఈ థ్రో బ్యాక్‌ పిక్స్‌ ముఖ్య ఉద్దేశం.

ఈ క్రమంలోనే టాలీవుడ్‌కు చెందిన ఓ అందాల తార సైతం తన చిన్ననాటి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. పైన ఫొటోలో ముగ్గురు చిన్నారులు కనిపిస్తున్నారు గమనించారా.? ఈ ఫొటోలో టాలీవుడ్‌కు చెందిన హీరోయిన్‌ ఉంది గుర్తు పట్టారా.? అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తుందీ బ్యూటీ. ఓవైపు గ్లామర్‌ పాత్రల్లో నటిస్తూనే మరోవైపు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనూ మెప్పిస్తుందీ చిన్నది. తమిళ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్‌ 2012లో తెలుగు కుర్రకారును పలకరించింది. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ చిన్నది స్పెషల్‌ సాంగ్స్‌లోనూ కనిపించింది.

ఇవి కూడా చదవండి

ఇక హీరోయిన్‌గా మెప్పిస్తూనే నెగిటివ్‌ రోల్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ సినిమాలో తన నట విశ్వరూపంతో మెస్మరైజ్‌ చేసింది. తాజాగా ఉమెన్‌ ఓరియెంటెడ్‌ మూవీతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం చేతిలో ఏకంగా 8 సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఇంతకీ ఈ హీరోయిన్‌ ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా.? ఈ హీరోయిన్‌ మరెవరో కాదు అందాల తార రెజీనా. ముగ్గురు చిన్నారుల్లో లెఫ్ట్‌ సైడ్‌ నుంచి ఫస్ట్‌ ప్లేస్‌లో ఉన్న ఆ చిన్నారే రెజీనా. రెడ్‌ కలర్‌ టీషర్ట్‌, జీన్స్‌లో ఉన్న చిన్నారి ఇప్పుడు కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోంది. రెజీనా ప్రస్తుతం తెలుగులో నేనేనా, మరీచికాతో పాటు తమిళం, మలయాళం చిత్రంలో నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..