AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay: మొన్న సమంత, నేడు విజయ్‌.. షాకింగ్‌ నిర్ణయం తీసుకున్న దళపతి

వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఓ కోలీవుడ్ స్టార్‌ హీరో షాకిండ్ డెసిషన్ తీసుకున్న కెరీర్‌ స్కై హై లో ఉన్న టైమ్‌లో లాంగ్ బ్రేక్‌కు రెడీ అవుతున్నారు. అది ఏదో కొన్ని నెలల పాటు కాదు.. ఏకంగా మూడేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యారు. ఇంత సీరియస్ డెసిషన్ తీసుకున్న ఆ హీరో ఎవరు? అసలు ఆ నిర్ణయం..

Vijay: మొన్న సమంత, నేడు విజయ్‌.. షాకింగ్‌ నిర్ణయం తీసుకున్న దళపతి
Vijay
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Jul 09, 2023 | 9:51 AM

Share

వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఓ కోలీవుడ్ స్టార్‌ హీరో షాకిండ్ డెసిషన్ తీసుకున్న కెరీర్‌ స్కై హై లో ఉన్న టైమ్‌లో లాంగ్ బ్రేక్‌కు రెడీ అవుతున్నారు. అది ఏదో కొన్ని నెలల పాటు కాదు.. ఏకంగా మూడేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యారు. ఇంత సీరియస్ డెసిషన్ తీసుకున్న ఆ హీరో ఎవరు? అసలు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? హిట్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుసగా వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్న కోలీవుడ్ టాప్ హీరో విజయ్‌. రజనీ కాంత్ తరువాత ఆ రేంజ్‌ ఇమేజ్‌, ఫాలోయింగ్ ఉన్న దళపతి… త్వరలో సిల్వర్‌ స్క్రీన్‌కు టెంపరరీ రిటైర్మెంట్ ప్రకటించాలనుకుంటున్నారట.

ప్రజెంట్ లియో వర్క్‌లో బిజీగా ఉన్న విజయ్‌, నెక్ట్స్ వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీనే విజయ్ ఆఖరి మూవీ అన్న ప్రచారం కూడా కొద్ది రోజులుగా జరుగుతోంది. అయితే ఈ విషయంలో మరో కొత్త ట్విస్ట్ తమిళనాట వైరల్‌గా మారింది. విజయ్ సిల్వర్‌ స్క్రిన్‌కు కంప్లీట్‌ రిటైర్మెంట్‌ ప్రకటించలేదట. జస్ట్ మూడేళ్ల విరామం మాత్రమే తీసుకునే ఆలోచనలో ఉన్నారన్నది నయా అప్‌డేట్‌. తమిళనాట విజయ్ పోలిటికల్ ఎంట్రీ గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. రాబోయే ఎలక్షన్స్‌లో విజయ్‌ పోటి చేస్తారన్న న్యూస్‌ ఈ మధ్య గట్టిగా వినిపిస్తోంది.

ఎన్నికల నేపథ్యంలోనే విజయ్ వెండితెర నుంచి విరామం తీసుకోబోతున్నారట. మూడేళ్ల పాటు పూర్తిగా పాలిటిక్స్ మీద కాన్సన్‌ట్రేట్ చేసేలా ప్లాన్ రెడీ చేస్తున్నారన్నది ట్రెండింగ్‌ న్యూస్‌. వన్స్ ఎలక్షన్స్ పూర్తయితే తిరిగి సినిమాల మీద కాన్సాన్‌ట్రేట్‌ చేసేలా కథలు పెండింగ్‌లో పెట్టేస్తున్నారట. మరి ఈ వార్తల్లో నిజమెంత.. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..