Article 370: ‘ఆర్టికల్ 370’ సినిమాను వీక్షించిన రాజ్‌నాథ్ సింగ్.. యామీ గౌతమ్ మూవీ గురించి ఏమన్నారంటే?
బాలీవుడ్ ప్రముఖ నటి, ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఆర్టికల్ 370'. కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు, ఆతర్వాత అక్కడ చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా ఆదిత్య సుహాస్ జంభాలె ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో యామీతో పాటు ప్రముఖ దక్షిణాది నటిప్రియమణి మరో కీలక పాత్రలో మెరిసింది.
బాలీవుడ్ ప్రముఖ నటి, ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఆర్టికల్ 370’. కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు, ఆతర్వాత అక్కడ చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా ఆదిత్య సుహాస్ జంభాలె ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో యామీతో పాటు ప్రముఖ దక్షిణాది నటిప్రియమణి మరో కీలక పాత్రలో మెరిసింది. టీజర్స్, ట్రైలర్ తోనే ఆసక్తిని రేకెత్తించిన ఆర్టికల్ 370 ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆర్టికల్ 370 సినిమాను వీక్షించారు. చిత్ర బృందానికి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సినిమాపై తన అభిప్రాయాలను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. దీంతో ఆర్టికల్ 370 మూవీ టీమ్ కు కొత్త బలం చేకూరింది. ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
‘కుటుంబంతో సహా ఢిల్లీలోని ఓ థియేటర్‌కి వెళ్లి ఆర్టికల్ 370 సినిమా చూశాను. ఈ సినిమా గురించి పలువురి ప్రశంసలు విన్నాను. యదార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమా తెరకెక్కింది. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాతి సంఘటనలను ఎంతో ఎఫెక్టివ్ గా చిత్రీకరించారు. సమస్య ఎంత క్లిష్టంగా ఉందో, దాన్ని పరిష్కరించడం ఎంత సవాలుతో కూడుకున్నదో ఈ సినిమాలో చూపించారు. మహిళా సాధికారతకు ఇది మంచి ఉదాహరణ. ఈ సినిమాకి కృషి చేసిన నిర్మాత-దర్శకులకు, ఆర్టిస్టులందరికీ నా అభినందనలు’ అని రాజ్‌నాథ్ సింగ్ అని ట్విట్టర్ వేదికగా ఆర్టికల్ 370 యూనిట్ పై ప్రశంసలు కురిపించారు రాజ్ నాథ్ సింగ్. ఆర్టికల్ 370 ఆగస్టు 5, 2019న రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. తర్వాత దీనిని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. దీని ఆధారంగానే ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో యామీ గౌతమ్ కథానాయికగా నటించింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ సినిమా విడుదలవ్వడంతో కొందరు ఈ సినిమాపై పెదవి విరుస్తున్నారు.
రాజ్ నాథ్ సింగ్ ట్వీట్..
आज दिल्ली के एक सिनेमाहाल में सपरिवार जाकर आर्टिकल 370 फ़िल्म देखी। इस फ़िल्म की प्रशंसा काफ़ी लोगों से सुनी थी। यह फ़िल्म सच्ची घटनाओं से प्रेरित है और बहुत ही प्रभावी तरीक़े जम्मू और कश्मीर में धारा 370 हटाने के घटनाक्रम को प्रस्तुत करती है।
यह फ़िल्म दिखाती है कि यह समस्या…
— Rajnath Singh (मोदी का परिवार) (@rajnathsingh) March 8, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.