- Telugu News Photo Gallery Cinema photos Mahesh Babu's Brahmotsavam Movie Star Avantika Vandanapu Hollywood Movie Goes Trending Telugu Actress Photos
Avantika Vandanapu: హాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా తెలుగు చైల్డ్ ఆర్టిస్ట్ అవంతిక వందనపు.!
హాలీవుడ్ సినిమాలు చేస్తున్న నేను తెలుగమ్మాయినే అంటున్నారు అవంతిక వందనపు. బ్రహ్మోత్సవం, అజ్ఞాతవాసి లాంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన ఈ అమ్మాయి, ఇప్పుడు హాలీవుడ్ సినిమాల్లో లీడ్ రోల్స్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్‌లో ఆమె చేసిన ఓ క్యారెక్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సీన్‌లో సమంత ముందు కూర్చొని ఆమె మాటలు వింటున్న ఆ చిన్నారి అవంతిక వందనపు.
Updated on: Mar 09, 2024 | 6:54 PM

హాలీవుడ్ సినిమాలు చేస్తున్న నేను తెలుగమ్మాయినే అంటున్నారు అవంతిక వందనపు. బ్రహ్మోత్సవం, అజ్ఞాతవాసి లాంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన ఈ అమ్మాయి, ఇప్పుడు హాలీవుడ్ సినిమాల్లో లీడ్ రోల్స్ చేస్తున్నారు.

రీసెంట్ టైమ్స్‌లో ఆమె చేసిన ఓ క్యారెక్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సీన్‌లో సమంత ముందు కూర్చొని ఆమె మాటలు వింటున్న ఆ చిన్నారి అవంతిక వందనపు.

ప్రజెంట్ హాలీవుడ్ సినిమాల్లో హాట్ లుక్స్‌లో అదరగొడుతున్న బ్యూటీ ఈమే. టాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాలతో పాటు కొన్ని యాడ్స్ కూడా చేసిన ఈ చిన్నారి ఇప్పుడు వెస్ట్రన్ స్క్రీన్ మీద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.

దాదాపు పది తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన అవంతిక, 2021లో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. టీన్ ఏజ్‌లోనే హాలీవుడ్ మూవీలో లీడ్ రోల్ చేసి షాక్ ఇచ్చారు. ఇండో అమెరికన్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన స్పిన్ మూవీ అవంతికకు హాలీవుడ్‌లో కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది.

దీంతో అక్కడ కూడా మంచి ఆఫర్స్ ఈ బ్యూటీని పలకరించాయి. ఈ ఏడాది మీన్ గర్ల్స్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చారు అవంతిక. ఈ సినిమాలో అవంతిక హాట్ లుక్స్ ఆడియన్స్‌కు షాక్ ఇచ్చాయి.

వెస్ట్రన్ మూవీస్‌లో అలాంటి క్యారెక్టర్స్ కామనే అయినా.. తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన అమ్మాయి, హాలీవుడ్‌లో అలాంటి క్యారెక్టర్ చేయటం మీద గట్టిగానే చర్చ జరిగింది. మీన్ గర్ల్స్ మూవీ ప్రమోషన్స్‌లో అవంతికే హైలెట్ అయ్యారు.

నిన్నమొన్నటి వరకు అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించిన చిన్నారి సడన్‌గా వెస్ట్రన్ యాక్సెంట్‌లో ఇంగ్లీష్ మాట్లాడుతూ.. బోల్డ్ లుక్స్ కనిపించటం హాట్ టాపిక్ అయ్యింది.

అయితే తాను అమెరికాలో ఉంటున్నా.. తెలంగాణ అమ్మాయినే అంటున్నారు ఈ బ్యూటీ. ఇప్పటికీ హైదరాబాద్ సిటీ, మన ట్రెడిషన్ వేరే తన ఫేవరెట్ అని చెప్పారు.




