Rajeev Rayala |
Updated on: Mar 09, 2024 | 1:51 PM
ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయింది కృతి శెట్టి. బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దాంతో కృతిశెట్టికి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వచ్చాయి.
ఉప్పెన సినిమా తర్వాత నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సాధించింది. అలాగే నాగచైతన్యకు కు జోడీగా బంగార్రాజు సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు కూడా హిట్ అయ్యాయి.
ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. యంగ్ హీరోల సినిమాలను ఓకే చేస్తూ దూసుకుపోయింది ఈ బ్యూటీ. కానీ ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి. కృతిశెట్టి హీరోగా నటించిన సినిమాలు ఏవి హిట్ అవ్వలేదు.
చివరిగా నాగచైతన్యతో కలిసి కస్టడీ సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో ఇప్పుడు ఈ చిన్నదానికి ఆఫర్స్ కరువయ్యాయి. ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా చేస్తుంది. అలాగే తమిళ్ లోనూ ఓ సినిమా చేస్తుంది.
ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కొన్ని ఫోటోలను వదిలింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి