AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈసారి షారుఖ్ ఖాన్ తో జవాన్ కంటే పెద్ద సినిమా తీస్తా.. అట్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

4 సంవత్సరాల తర్వాత  షారుక్ ఖాన్ పఠాన్ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. ఆ తర్వాత జవాన్‌తో  హిందీ సినిమా రికార్డులను బద్దలు కొట్టాడు. భారతదేశంలో హిందీ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా జవాన్ నిలిచింది. షారుక్ నటించిన జవాన్ వెయ్యి కోట్లకు పైగా బిజినెస్ చేసింది.

ఈసారి షారుఖ్ ఖాన్ తో జవాన్ కంటే పెద్ద సినిమా తీస్తా.. అట్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Rajeev Rayala
|

Updated on: Feb 25, 2024 | 2:29 PM

Share

సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్  కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి.. ఆయన సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతేడాది షారుక్ ఖాన్ మూడు బ్లాక్ బస్టర్ చిత్రాలను ప్రేక్షకులకు అందించాడు కింగ్ ఖాన్. 4 సంవత్సరాల తర్వాత  షారుక్ ఖాన్ పఠాన్ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. ఆ తర్వాత జవాన్‌తో  హిందీ సినిమా రికార్డులను బద్దలు కొట్టాడు. భారతదేశంలో హిందీ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా జవాన్ నిలిచింది. షారుక్ నటించిన జవాన్ వెయ్యి కోట్లకు పైగా బిజినెస్ చేసింది.

ఈ చిత్రానికి సౌత్ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించారు. అట్లీ ఎప్పటినుంచో షారుఖ్ ఖాన్‌తో కలిసి పని చేయాలనుకున్నాడు. జవాన్ ద్వారా అతని కల నెరవేరింది. అయితే షారుఖ్‌తో కలిసి పనిచేయడం పట్ల అట్లీ సంతృప్తిగా లేరని ఇన్ సైడ్ టాక్. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు అట్లీ ఓ పెద్ద హింట్ ఇచ్చాడు. ఈ వార్త అందరినీ సంతోషపెట్టింది. భవిష్యత్తులో మళ్లీ షారుఖ్‌తో కలిసి పనిచేయడం గురించి దర్శకుడిని అడిగినప్పుడు.. ఆయన మాట్లాడుతూ..“నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాను, నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను, నేను మీకు జవాన్ కంటే పెద్ద చిత్రాన్ని ఇస్తాను ఆలాగే నేను ఖచ్చితంగా షారుఖ్ ఖాన్ తో కలసి పని చేస్తా “అన్నారు .

అట్లీ తన సినిమా స్క్రిప్ట్‌ను షారుఖ్ ఖాన్ వద్దకు తీసుకువెళతానని చెప్పాడు. కథ నచ్చితే తప్పకుండా కలిసి చేస్తానన్నారు.  అట్లీ  మాట్లాడుతూ, “షారుఖ్ నన్ను చాలా అభిమానిస్తారని నాకు తెలుసు. ఆయన చాలా భిన్నంగా ఉంటాడు. నా జీవితంలో ఇప్పటివరకు నేను చూసిన అత్యుత్తమ వ్యక్తి ఆయన. ధన్యవాదాలు, షారుక్ సార్. జవాన్ కంటే పెద్ద సినిమా చేద్దాం.. నేను తప్పకుండా నీ దగ్గరకు వస్తాను” అని చెప్పాడు. ప్రస్తుతం అట్లీ లిస్ట్ లో చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు. వారిలో దళపతి విజయ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి హీరోలు ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొండెక్కిన కోడి గుడ్ల ధరలు.. చరిత్రలో ఆల్ టైం రికార్డ్
కొండెక్కిన కోడి గుడ్ల ధరలు.. చరిత్రలో ఆల్ టైం రికార్డ్
కీచకులు.. యాసిడ్ పోస్తామని మైనర్ బాలికకు వేధింపులు.. ఆ తర్వాత ..
కీచకులు.. యాసిడ్ పోస్తామని మైనర్ బాలికకు వేధింపులు.. ఆ తర్వాత ..
మీరు 10వ తేదీన పుట్టారా.? 2026లో వీరికి లక్కే.. లక్కు.!
మీరు 10వ తేదీన పుట్టారా.? 2026లో వీరికి లక్కే.. లక్కు.!
హోస్ట్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి గంభీర్ సేన అద్భుతం సృష్టిస్తుందా
హోస్ట్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి గంభీర్ సేన అద్భుతం సృష్టిస్తుందా
50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో...! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు
50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో...! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు
శ్రీశైలం టూర్ వెళ్లేవారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ఆఫర్..
శ్రీశైలం టూర్ వెళ్లేవారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ఆఫర్..
చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు..
చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు..
బంగారం షాప్‌కొచ్చిన ఐదుగురు లేడిస్.. కస్టమర్లు అనుకునేరు..
బంగారం షాప్‌కొచ్చిన ఐదుగురు లేడిస్.. కస్టమర్లు అనుకునేరు..
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..