AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Urvashi Rautela: వామ్మో.. ఈ బ్యూటీ రేంజే వేరు.. బర్త్ డేకి బంగారు కేట్ కట్ చేసిన హీరోయిన్..

హిందీలో అనేక సినిమాల్లో స్టార్ హీరోలతో ఆడిపాడి అలరించింది. గత ఏడాదిగా తెలుగు సినిమాల్లోనూ కనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ పాటకు స్టెప్పులేసింది. అలాగే రామ్ పోతినేని నటించిన స్కంద సినిమాలోనూ స్పెషల్ సాంగ్ చేసింది. ఊర్వశి రౌతేలా నిత్యం ఏదోక వార్తతో వార్తలలో నిలుస్తుంటుంది.

Urvashi Rautela: వామ్మో.. ఈ బ్యూటీ రేంజే వేరు.. బర్త్ డేకి బంగారు కేట్ కట్ చేసిన హీరోయిన్..
Urvashi Rautela
Rajitha Chanti
|

Updated on: Feb 25, 2024 | 1:32 PM

Share

బాలీవుడ్ సినీ తారలలో ఊర్వశి రౌతేలా ఒకరు. హీరోయిన్‏గా కాకుండా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి ఈ బ్యూటీ బాగా ఫేమస్ అయ్యింది. హిందీలో అనేక సినిమాల్లో స్టార్ హీరోలతో ఆడిపాడి అలరించింది. గత ఏడాదిగా తెలుగు సినిమాల్లోనూ కనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ పాటకు స్టెప్పులేసింది. అలాగే రామ్ పోతినేని నటించిన స్కంద సినిమాలోనూ స్పెషల్ సాంగ్ చేసింది. ఊర్వశి రౌతేలా నిత్యం ఏదోక వార్తతో వార్తలలో నిలుస్తుంటుంది. కొన్ని నెలల క్రితం క్రికెటర్ గురించి ఆసక్తికర ట్వీట్స్ చేసి అతడి అభిమానులకు కోపం తెప్పించింది. అలాగే క్రికెట్ స్టేడియంలో తన ఫోన్ పోయిందంటూ నానా హంగామా సృష్టించింది. దీంతో కేవలం ఆమె పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తుందంటూ నెటిజన్స్ మండిపడ్డారు. ఇక కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మరోసారి వార్తలలో నిలిచింది. తన బర్త్ డేకు బంగారపు కేక్ కట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.

ఫిబ్రవరి 25న ఊర్వశి బర్త్ డే. ఈ సందర్భంగా ఆమె బంగారపు కేక్ కట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ప్రతి సంవత్సరం తన పుట్టినరోజును ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటుంది ఊర్వశి. ఇక ఈసారి కూడా తన పుట్టినరోజు వేడుకలను స్నేహితుల సమక్షంలో ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ వేడుకలలోనే 24 క్యారెట్లతో బంగారపు పూత పూసిన కేక్ కట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. ఊర్వశి తీరుపై మండిపడుతున్నారు నెటిజన్స్.

ఊర్వశి రౌటేలా 25 ఫిబ్రవరి 1994న ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్‌లో జన్మించింది. అతి చిన్న వయసులో మోడలింగ్ స్టార్ట్ చేసిన ఆమె.. సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసింది. ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ చిత్రం ‘సింగ్ సాహెబ్ ది గ్రేట్’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అంతేకాకుండా.. ఆమె మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో రెండు సార్లు విజేతగా నిలిచింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.