AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonakshi Sinha: సోనాక్షి పెళ్లి తండ్రికి ఇష్టం లేదా? శత్రుఘ్న సిన్హా ఆన్సర్ ఇదే… వారికి గట్టిగానే ఇచ్చేశాడుగా

బాలీవుడ్ ప్రముఖ నటి సోనాక్షి సిన్హా త్వరలో పెళ్లి చేసుకోనుంది. సహచర నటుడు జహీర్ ఇక్బాల్‌తో కలిసి ఆమె వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనుంది. అయితే సోనాక్షి- జహీర్ ల వివాహంపై పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా వీరిద్దరిది మతాంతర వివాహం కావడంతో కుటుంబ సభ్యుల పూర్తి అంగీకారం లేదని కొందరు గగ్గోలు పెడుతున్నారు.

Sonakshi Sinha: సోనాక్షి పెళ్లి తండ్రికి ఇష్టం లేదా? శత్రుఘ్న సిన్హా ఆన్సర్ ఇదే... వారికి గట్టిగానే ఇచ్చేశాడుగా
Sonakshi Sinha Marriage
Basha Shek
|

Updated on: Jun 21, 2024 | 11:31 AM

Share

బాలీవుడ్ ప్రముఖ నటి సోనాక్షి సిన్హా త్వరలో పెళ్లి చేసుకోనుంది. సహచర నటుడు జహీర్ ఇక్బాల్‌తో కలిసి ఆమె వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనుంది. అయితే సోనాక్షి- జహీర్ ల వివాహంపై పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా వీరిద్దరిది మతాంతర వివాహం కావడంతో కుటుంబ సభ్యుల పూర్తి అంగీకారం లేదని కొందరు గగ్గోలు పెడుతున్నారు. అలాగే సోనాక్షి సిన్హా తండ్రి శత్రుఘ్న సిన్హాకు ఈ పెళ్లి ఇష్టం లేదని, అసలు పెళ్లి గురించే తమకెలాంటి సమాచారం, ఆహ్వానం అందలేదని చెప్పినట్లు రూమర్లు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై సోనాక్షి తండ్రి శతృఘ్న సిన్హా స్పందించారు . అలాగే కూతురి పెళ్లి గురించి కూడా ఆనందంగా మాట్లాడారు. ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శత్రుఘ్న సిన్హా తన కూతురు పెళ్లిపై స్పందించారు. ‘ సోనాక్షి అంటే చాలా ఇష్టం. సోనాక్షి నన్ను తన మూలస్తంభంగా భావిస్తుంది. నేను వారి పెళ్లికి తప్పకుండా హాజరవుతాను. నేను ఎందుకు పెళ్లికి హాజరవ్వకూడదు. సోనాక్షి, జహీర్ కలిసి జీవించాలి. వారి జోడీ చాలా బాగుంది. వారు ఇద్దరూ కలిసి గొప్ప జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నా’ అని శతృఘ్న సిన్హా చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసేవాళ్లకు కూడా తనదైన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చారు శత్రుఘ్న సిన్హా ..‘కామూష్.. ఇది మీకు సంబంధించినది కాదు. మీ పని మాత్రమే చూసుకోండి’ అని గట్టిగానే హెచ్చరించారు. కాగా సల్మాన్ ఖాన్ ద్వారా సోనాక్షి జహీర్‌ను కలుసుకుంది. సల్లూ, జహీర్ స్నేహితులు. ఈ భేటీ తర్వాత సోనాక్షి, జహీర్ మధ్య స్నేహం పెరిగింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. వీరిద్దరూ కలిసి ‘డబుల్ ఎక్స్‌ఎల్‌’ చిత్రంలో నటించారు. జూన్ 23న ఈ ప్రేమ పక్షుల వివాహం జరగనుంది. ముంబై వేదికగా  జరిగే ఈ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, బంధువులు మాత్రమే  హాజరవుతారని తెలుస్తోంది. ఇక జహీర్ విషయానికి వస్తే.. 2019లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. అతను ఇంతకుముందు కూడా కొంత మంది హీరోయిన్లతో డేటింగ్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటించిన ‘హీరమండి’ అనే వెబ్ సిరీస్ ఇటీవల విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Horoscope Today: వారి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం..
Horoscope Today: వారి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం..
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..