Shabaash Mithu: అదరగొట్టిన తాప్సీ.. శభాష్ మిథు ట్రైలర్ వేరేలెవల్.. మీరు చూసేయ్యండి..

చిన్నతనం నుంచి క్రికెటర్ కావాలని ఆరాటపడిన మిథాలీ.. తన లక్ష్యం కోసం జీవితంలో ఎన్ని ఒడిదుడుకులను.. అవమానాలను ఎదుర్కొంది..

Shabaash Mithu: అదరగొట్టిన తాప్సీ.. శభాష్ మిథు ట్రైలర్ వేరేలెవల్.. మీరు చూసేయ్యండి..
Shabaash Mithu
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 20, 2022 | 11:32 AM

భారత మహిళా క్రికెట్‏లో ఎన్నో సేవలు అందించి.. ఉమెన్స్ జట్టుకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది కెప్టెన్ మిథాలీ రాజ్ (Mithali Raj).. దాదాపు రెండు దశాబ్దాల పాటు క్రికెట్‏లో విశేషమైన సేవలందించి ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించింది. ఇప్పుడు ఆమె జీవిత కథను వెండితెరపై చూపించబోతున్నారు బాలీవుడ్ డైరెక్టర్ శ్రీజిత్.. తొలిసారి లేడీ క్రికెటర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మిథాలీ పాత్రలో స్టార్ హీరోయిన్ తాప్సీ నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.. వయాకామ్‌ 18 స్డూడియోస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్‌, పోస్టర్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా సోమవారం ఉదయం శభాష్ మిథు ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

చిన్నతనం నుంచి క్రికెటర్ కావాలని ఆరాటపడిన మిథాలీ.. తన లక్ష్యం కోసం జీవితంలో ఎన్ని ఒడిదుడుకులను.. అవమానాలను ఎదుర్కొంది.. మహిళ క్రికెట్ జట్టుకు గుర్తింపు రావడం కోసం ఎంతలా శ్రమించింది.. అనే విషయాలను ట్రైలర్‏లో ప్రేక్షకుల కళ్లకు కట్టినట్లుగా చూపించారు మేకర్స్.. మెన్ ఇన్ బ్లూ మాదిరిగానే మనకు కూడా ఉమెన్ ఇన్ బ్లూ అనే టీమ్ ఉంటే బాగుంటుందని ఎనిమిదేళ్ల నుంచి కలలు కంటున్నాను.. అంటూ తాప్సీ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. అలాగే.. మిథాలీ పాత్రలో తాప్సీ జీవించేసింది.. మొత్తానికి మిథాలీ రాజ్ జీవితాన్ని వెండితెరపై ఎంత అద్భుతంగా చూపించబోతున్నారనే విషయాన్ని ట్రైలర్‏ చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ జూలై 15న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ట్రైలర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!