Salman Khan: రామ జన్మభూమి వాచ్‌ను ధరించిన సల్మాన్ ఖాన్.. ముస్లిం మత పెద్ద ఏమన్నారంటే?
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ రామ జన్మభూమి ఎడిషన్ వాచ్ ధరించడం వివాదానికి దారితీసింది. ముస్లిం మతాధికారులు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు. సల్మాన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సల్మాన్ ఖాన్ అన్ని మతాలను గౌరవిస్తాడని ఆయన అభిమానులు వాదిస్తున్నారు. సల్మాన్ సినిమా సికిందర్ విడుదల సమయంలో ఈ వివాదం చర్చనీయాంశంగా మారింది.

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన సికిందర్ సినిమా ఆదివారం (మార్చి 30) విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సల్మాన్ ఖాన్ ఇటీవల ప్రత్యేక గడియారం ధరించి పోజులిచ్చాడు. ఈ గడియారం ‘రామ జన్మభూమి ఎడిషన్’ కు సంబంధించినది. ఇది సల్మాన్ అభిమానుల దృష్టిని బాగా ఆకర్షించింది. అదే సమయంలో వివాదాస్పదమూ అయ్యింది. సల్మాన్ రామ జన్మభూమి వాచ్ ధరించడంపై ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి. సల్మాన్ తప్పుచేశాడని, క్షమాపణ చెప్పాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం గురించి సోషల్ మీడియాలో చర్చలు జోరుగా సాగుతున్నాయి. ‘సల్మాన్ ఖాన్ రామమందిరానికి సంబంధించిన వాచ్‌ను ధరించాడు. ముస్లింగా ఉన్నప్పుడు అలాంటి గడియారాన్ని ధరించడం హరామ్’ అని ఆల్ ఇండియా ముస్లిం జమాత్‌కు చెందిన మౌలానా షాహబుద్దీన్ రజ్వీ సల్మాన్ పై విమర్శలు చేశారు.
‘సల్మాన్ ఖాన్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి. ఆయనకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. కానీ అతను ఓ ముస్లిం. మరి, ఇలాంటి వాచ్ ధరించడం సరైనదేనా? అది సల్మాన్ ఖాన్ అయినా లేదా మరే ఇతర ముస్లిం అయినా రామమందిరాన్ని లేదా మరే ఇతర ముస్లిమేతర అంశాలను ప్రచారం చేస్తే, అది చట్టవిరుద్ధం. దానిని హరామ్ గా పరిగణిస్తారు. షరియా సూత్రాలను పాటించాలని నేను సల్మాన్ ఖాన్‌ను కోరుతున్నాను” అని మౌలానా రజ్వీ డిమాండ్ చేశారు.
సల్మాన్ ఖాన్ తప్పు చేశాడు..
#WATCH | Bareilly, UP: On Actor Salman Khan, President of All India Muslim Jamaat, Maulana Shahabuddin Razvi Bareilvi says, “Salman Khan is a very famous personality in India… Salman Khan has been seen wearing a Ram edition watch to promote Ram Mandir… If any Muslim, even if… pic.twitter.com/nCGSGhddLM
— ANI (@ANI) March 28, 2025
సల్మాన్ ఖాన్ జాకబ్ & కో ఎపిక్ రామ జన్మభూమి టైటానియం ఎడిషన్ 2 వాచ్ ధరించాడు. దీని ధర సుమారు. 34 లక్షల రూపాయలు. ఇక సల్మాన్ ఖాన్ చిత్రం ‘సికందర్’ మార్చి 30న విడుదల కానుంది.
రామ మందిర్ వాచ్ తో సల్మాన్ ఖాన్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..