AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kannappa: తప్పట్లేదు.. క్షమించండి.. కన్నప్ప సినిమాపై మంచు విష్ణు సంచలన నిర్ణయం

టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తోన్నచిత్రం కన్నప్ప. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఎప్పటి నుంచో చెబుతోన్న మంచు విష్ణు అందుకు తగ్గట్టుగానే భారీ తారగణం, భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.

Kannappa: తప్పట్లేదు.. క్షమించండి.. కన్నప్ప సినిమాపై మంచు విష్ణు సంచలన నిర్ణయం
Kannappa Movie
Basha Shek
|

Updated on: Mar 29, 2025 | 5:18 PM

Share

టాలీవుడ్ హీరో మంచు విష్ణు తాజా చిత్రం కన్నప్ప. హిందీ మహా భారతం ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో స్టారాది స్టార్లు నటిస్తున్నారు. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, ఐశ్వర్య రాజేష్, శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్ రిషి, కరుణాస్, యోగి బాబు, సప్తగిరి, రఘు బాబు, , దేవరాజ్, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా (విష్ణు కూతుళ్లు) తదితరులు కన్నప్ప సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై మంచు మోహన్ బాబు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా కన్నప్ప సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ఇది వరకే అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అందుకు తగ్గట్టే ఇటీవల ప్రమోషన్లలో స్పీడ్ పెంచారు. ముఖ్యంగా మంచు విష్ణు వరుసగా ఇంట్వర్యూల్లో పాల్గొంటున్నాడు. అయితే ఉన్నట్లుండి ఫ్యాన్స్‌ కు షాకిచ్చాడు మంచు విష్ణు. కన్నప్ప సినిమాను రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించాడు.

‘అత్యున్నత ప్రమాణాలు, విలువలతో కన్నప్ప సినిమాను మీ ముందుకు తీసుకురావాలని మేము ఎంతగానో ప్రయత్నిస్తున్నాం. అయితే కొన్ని కీలక సన్నివేశాలకు ఇంకా వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ చేయాల్సి ఉంది. దీనికి మరికొంత సమయం పడుతుంది. ఫలితంగా సినిమా రిలీజ్‌ కాస్త ఆలస్యం అవుతుంది. మీరందరూ మా పరిస్థితి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాము. శివ భక్తుడైన కన్నప్ప సినిమా చరిత్రను మీ ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్‌ విశేషంగా కృషి చేస్తోంది. త్వరలోనే సినిమా కొత్త రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తాం’ అని ఓ నోట్‌ షేర్‌ చేశాడు మంచు విష్ణు. కన్నప్ప సినిమా రిలీజ్ వాయిదా పడడంతో సినీ అభిమానులు, ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

ఇవి కూడా చదవండి

మంచు విష్ణు ట్వీట్..

కన్నప్ప సినిమాలో ప్రభాస్..

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.