Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Betting Apps Case: బిర్యానీ పేరుతో బెట్టింగ్ యాప్ ప్రమోషన్.. అలీ గురించి సంచలన వీడియో రిలీజ్ చేసిన అన్వేష్

ఆన్ లైన్ బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తూ లక్షలు సంపాదిస్తోన్న సెలబ్రిటీల గుట్టు రట్టు చేస్తున్నాడు ప్రపంచ యాత్రికుడు అన్వేష్. ఇప్పటకే హర్ష సాయి, సన్నీ యాదవ్, పల్లవి ప్రశాంత్ తదితర ప్రముఖుల బాగోతాలను బయట పెట్టిన అతను తాజాగా నటుడు అలీ గురించి సంచలన విషయాలు బయట పెట్టాడు.

Betting Apps Case: బిర్యానీ పేరుతో బెట్టింగ్ యాప్ ప్రమోషన్.. అలీ గురించి సంచలన వీడియో రిలీజ్ చేసిన అన్వేష్
Anvesh, Ali
Follow us
Basha Shek

|

Updated on: Mar 29, 2025 | 5:54 PM

బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తోన్నసెలబ్రిటీల గుట్టు రట్టు చేసి హీరో అయిపోయాడు ఫేమస్ యూట్యూర్ అన్వేష. ఇప్పటికే అతను ఎంతోమంది సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు, సెలబ్రిటీల పేర్లను బయట పెట్టాడు. తాజాగా నటుడు అలీ గురించి సంచలన విషయాలు బయట పెట్టాడు అన్వేష్. ఈ మేరకు తన ‘నా అన్వేషణ’ యూట్యూబ్ ఛానెల్ లో అలీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు సంబంధించి ఒక వీడియోను రిలీజ్ చేశాడు. అందులో ఇలా చెప్పుకొచ్చాడు అన్వేష్. ‘నాకు ఇష్టమైన నటుడు.. నాకు ఇష్టమైన కమెడియన్ మీరే సార్. చిన్న చిన్న వాళ్లు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినా ఒక అర్థం ఉంది. కానీ.. మీలాంటి కోట్లకు పడగలెత్తిన వాళ్లు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడమేంటి సార్. వెయ్యి‌కి పైగా సినిమాల్లో నటించారు. వందల కోట్లు ఆస్తులున్నాయి. అవన్నీ ఏంచేసుకుంటారు సార్? ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల వల్ల మీకు లాభం రావొచ్చు.. కానీ.. ప్రజలకు చాలా నష్టం జరిగింది. మీరు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన చాలా వీడియోలను ఇప్పటికే డిలీట్ చేశారు. కానీ వాటిని చూసిన జనం మర్చిపోలేదు’

‘రంజాన్ మాసంలో చాలా పవిత్రంగా ఉండాలి. కానీ మీరు రంజాన్ మాసంలో కూడా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారు. అప్పుడు నేను మీకు ఒక మెసేజ్ చేశాను. ‘రంజాన్ మాసంలో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయకూడదని. దానికి మీరు.. ఏం కామెంట్ చేశారో గుర్తుందా? ‘అల్లా ఎక్కడైనా చెప్పారా?’ అని నాకు రిప్లై ఇచ్చారు. ఈ బెట్టింగ్ యాప్‌ల వల్ల.. అందులోనూ మీలాంటి వారి వల్ల నష్టపోయిన వాళ్లు చాలామంది ఉన్నారు సార్. అలాంటి వాళ్లను ఆర్థికంగా ఆదుకోండి సార్. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి మంచి పని చేయండి. నేనేమీ మీ సొంత డబ్బులు ఇవ్వమనట్లేదు. ఆ బెట్టింగ్ యాప్‌ల వల్ల సంపాదించిన డబ్బునే తిరిగి వాళ్లకే ఇచ్చి పాపాన్ని కాస్త అయినా కడుక్కోండి సార్. అది పాపపు సొమ్ము.. రక్తపు కూడు సార్’ అని చెప్పుకొచ్చాడు అన్వేష్.

కాగా అలీ తన భార్య జుబేదా తో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. ఈ ఛానెల్ కుసుమారు 20 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఇటీవ అలీ దంపతులు స్వయంగా బిర్యానీ తయారు చేసి అందరికీ పంచి పెట్టారట. ఆ వీడియోను తమ యూట్యూబ్ ఛానెల్ లో అప్ లోడ్ చేశారట. అయితే ఈ వీడియో ఒక బెట్టింగ్ యాప్ ను అలీ దంపతులు ప్రమోట్ చేశారంటున్నాడు అన్వేష్. ఈ వీడియోను కోట్లాది మంది చూశారని, తద్వారా అలీకి బాగా లాభాలు వచ్చాయంటున్నాడు ప్రపంచ యాత్రికుడు. మరి వీటిపై అలీ ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.