Priyanka Chopra: వరుస బెట్టి ఆస్తులన్నింటినీ అమ్మకానికి పెట్టేస్తోన్న ప్రియాంక చోప్రా.. కారణమేంటంటే?

ప్రముఖ బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా పాప్ సింగర్ నిక్ జోనాస్‌ని పెళ్లి చేసుకుని అమెరికాలోనే స్థిరపడింది. ప్రస్తుతం హాలీవుడ్‌ సినిమాలు, వెబ్‌ సిరీసుల్లోనే ఎక్కువగా కనిపిస్తోందీ గ్లోబల్‌ స్టార్‌. ప్రియాంక బాలీవుడ్‌ మూవీలో కనిపించి సుమారు మూడేళ్లు గడుస్తోంది. ఆమె చివరిగా 2021లో ది వైట్‌ టైగర్‌ అనే హిందీ సినిమాలో నటించింది.

Priyanka Chopra: వరుస బెట్టి ఆస్తులన్నింటినీ అమ్మకానికి పెట్టేస్తోన్న ప్రియాంక చోప్రా.. కారణమేంటంటే?
Priyanka Chopra
Follow us

|

Updated on: Nov 18, 2023 | 5:11 PM

ప్రముఖ బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా పాప్ సింగర్ నిక్ జోనాస్‌ని పెళ్లి చేసుకుని అమెరికాలోనే స్థిరపడింది. ప్రస్తుతం హాలీవుడ్‌ సినిమాలు, వెబ్‌ సిరీసుల్లోనే ఎక్కువగా కనిపిస్తోందీ గ్లోబల్‌ స్టార్‌. ప్రియాంక బాలీవుడ్‌ మూవీలో కనిపించి సుమారు మూడేళ్లు గడుస్తోంది. ఆమె చివరిగా 2021లో ది వైట్‌ టైగర్‌ అనే హిందీ సినిమాలో నటించింది. ప్రస్తుతం కాలిఫోర్నియాలోనే సెటిలైన ఈ ముద్దుగుమ్మ సినిమాలతో పాటు అక్కడే రెస్టారెంట్‌ బిజినెస్‌ కూడా ప్రారంభించిందట. అయితే పండగలు, విశేష పర్వదినాల్లో తప్పకుండా ఇండియాకు వస్తోంది ప్రియాంక. తన కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేషన్స్‌ చేరుకుంటోంది. ఇదిలా ఉంటే హిందీలో సినిమాలు చేసే సమయంలో ముంబైలో పలు ఆస్తులు కొనుగోలు చేసింది ప్రియాంక. అయితే ఇప్పుడు వీటన్నింటిని అమ్మకానికి పెట్టేసిందని బాలీవుడ్ మీడియా సర్కిళ్లలో టాక్‌ వినిపిస్తోంది. గతేడాదే తన పేరిట ఉన్న కొన్ని ఆస్తులను విక్రయించిందీ గ్లోబల్‌ బ్యూటీ. ఇప్పుడు మరో రెండు పెంట్ హౌస్ లు అమ్మేసిందట. దీపావళి వేడుకల కోసం ప్రియాంక ముంబైకి వచ్చింది. ఈ సమయంలో, ముంబైలోని అంధేరిలో ఉన్న రెండు పెంట్‌హౌస్‌లను ప్రముఖ నిర్మాత, దర్శకుడు అభిషేక్ చౌబేకి విక్రయించిందంట. అందుకు ప్రతిఫలంగా రూ.6 కోట్లు తీసుకుందని గుసగుసలు వినిపిస్తు్న్నాయి. ఓషివారాలోని ఓ పెంట్‌హౌస్‌ను రూ.2.25 కోట్లకు, రెండో పెంట్‌హౌస్‌ను రూ.3.75 కోట్లకు విక్రయించారు.ఈ రెండు ఆస్తుల విక్రయానికి గానూ సుమారు 36 లక్షల రూపాయల స్టాంపు డ్యూటీ చెల్లించింద ప్రియాంక. అక్టోబర్ 23, 25 తేదీల్లో ఈ లావాదేవీలు జరిగాయట.

కాగా ప్రియాంక చోప్రా తన ఆస్తులన్నింటినీ విక్రయిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇండియాతో తనకున్న సంబంధాన్ని తెంచుకోవాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ముంబైలో వరుస బెట్టి తన ఆస్తులను అమ్మకానికి పెడుతోందని తెలుస్తోంది. ప్రియాంక చోప్రా ప్రస్తుతం పలు ఇంగ్లిష్ సీరియల్స్, సినిమాలు, సిరీసుల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంటోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌ సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు రెండో సీజన్‌ షూటింగ్‌లో బిజీగా ఉంటోందీ గ్లోబల్‌ స్టార్‌. అలాగే హెడ్స్ ఆఫ్ స్టేట్ తో పాటు పలు వెబ్‌సీరీస్‌ల్లోనూ నటిస్తోందీ అందాల తార. ఆ మధ్యన ఓ హిందీ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పినా ఏమైందో తెలియదు కానీ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది.

ఇవి కూడా చదవండి

కూతురుతో ప్రియాంక చోప్రా..

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బీజేపీ సంచలన నిర్ణయం.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్‌..
బీజేపీ సంచలన నిర్ణయం.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్‌..
నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం..
నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం..
రూ. 5 కోసం గొడవ.. మహిళ క్యాబ్ డ్రైవర్ మధ్య తీవ్ర వాగ్వాదం
రూ. 5 కోసం గొడవ.. మహిళ క్యాబ్ డ్రైవర్ మధ్య తీవ్ర వాగ్వాదం
మరోసారి ఢిల్లీ పయనమవుతోన్న రేవంత్‌ రెడ్డి.. కారణం ఏంటంటే..
మరోసారి ఢిల్లీ పయనమవుతోన్న రేవంత్‌ రెడ్డి.. కారణం ఏంటంటే..
ప్చ్.. అన్ని పోయాయ్.. బీఆర్ఎస్‌లో ఆ ఇద్దరు నేతలది వింత సమస్య..
ప్చ్.. అన్ని పోయాయ్.. బీఆర్ఎస్‌లో ఆ ఇద్దరు నేతలది వింత సమస్య..
సొంతింటికల సాకారానికి అద్భుతమైన వేదిక టీవీ9 స్వీట్ హోమ్ ఎక్స్‌పో
సొంతింటికల సాకారానికి అద్భుతమైన వేదిక టీవీ9 స్వీట్ హోమ్ ఎక్స్‌పో
యువ రైతుపై దాడి చేసిన పులిని చంపేందుకు అటవీ శాఖ ఉత్తర్వులు
యువ రైతుపై దాడి చేసిన పులిని చంపేందుకు అటవీ శాఖ ఉత్తర్వులు
ఓటీటీలో వ్యూహం.. క్రైమ్ థ్రిల్లర్‌ సిరీస్‌ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలో వ్యూహం.. క్రైమ్ థ్రిల్లర్‌ సిరీస్‌ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఇంట్లో కుబేర యంత్రాన్ని ఏ దిశలో ఏర్పాటు చేయాలంటే..
ఇంట్లో కుబేర యంత్రాన్ని ఏ దిశలో ఏర్పాటు చేయాలంటే..
ఫిట్‌గా ఉండాలా.? సెలబ్రిటీలు ఫాలో అయ్యే ఈ వర్కవుట్స్‌ చేయండి..
ఫిట్‌గా ఉండాలా.? సెలబ్రిటీలు ఫాలో అయ్యే ఈ వర్కవుట్స్‌ చేయండి..
నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం..
నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం..
Chandrababu - KCR: మాజీ సీఎం కేసీఆర్‍కు చంద్రబాబు పరామర్శ.. లైవ్
Chandrababu - KCR: మాజీ సీఎం కేసీఆర్‍కు చంద్రబాబు పరామర్శ.. లైవ్
పెంట్‌ హౌస్‌ ధర రూ 1,133 కోట్లు! ఎక్కువ ధర పలికిన పెంట్‌ హౌస్‌.
పెంట్‌ హౌస్‌ ధర రూ 1,133 కోట్లు! ఎక్కువ ధర పలికిన పెంట్‌ హౌస్‌.
ఆకాశంలో దెయ్యం.! ఓ భారీ గెలాక్సీకి దెయ్యం ముఖం వంటి ఆకృతి..
ఆకాశంలో దెయ్యం.! ఓ భారీ గెలాక్సీకి దెయ్యం ముఖం వంటి ఆకృతి..
రేవంత్ అన్నా అంటూ కష్టం చెప్పుకున్న మహిళ.. సీఎం ఏం చేశారంటే
రేవంత్ అన్నా అంటూ కష్టం చెప్పుకున్న మహిళ.. సీఎం ఏం చేశారంటే
సినీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో నాకు తెలియాలి.. మంత్రి కోమటిరెడ్డి
సినీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో నాకు తెలియాలి.. మంత్రి కోమటిరెడ్డి
ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు.! తీర్పు చదువుతున్న ధర్మాసనం.
ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు.! తీర్పు చదువుతున్న ధర్మాసనం.
ఘరానా మోసం..నకిలీ టోల్‌ప్లాజాతో కోట్లు కొట్టేశారు.! వీడియో..
ఘరానా మోసం..నకిలీ టోల్‌ప్లాజాతో కోట్లు కొట్టేశారు.! వీడియో..
వరద నీటిలో రజనీకాంత్‌ ఇల్లు.! ఇంటిచుట్టూ నిలిచిపోయిన వరదనీరు.
వరద నీటిలో రజనీకాంత్‌ ఇల్లు.! ఇంటిచుట్టూ నిలిచిపోయిన వరదనీరు.
వర్షం ప‌డ‌ని వింత గ్రామం.. ఈ ఊర్లో మేఘాలను చేత్తో తాకవచ్చు.!
వర్షం ప‌డ‌ని వింత గ్రామం.. ఈ ఊర్లో మేఘాలను చేత్తో తాకవచ్చు.!