AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema: ఇదేం సినిమారా బాబూ! 40 కోట్లతో తీస్తే మరీ 500 టికెట్లు మాత్రమే తెగాయ్.. ఇప్పుడు యూట్యూబ్‌లో చూడొచ్చు

ఈ దశాబ్దంలోనే అతిపెద్ద ఫ్లాప్ సినిమా ఇదేనని చెప్పుకోవచ్చు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ బడ్జెట్ ఏకంగా 45 కోట్లు.. అయితే చివరికి 60 వేల రూపాయలు కూడా రాలేదు.. మరీ దారుణంగా మొత్తం కలిపి కేవలం 500 టిక్కెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

Cinema: ఇదేం సినిమారా బాబూ! 40 కోట్లతో తీస్తే మరీ 500 టికెట్లు మాత్రమే తెగాయ్.. ఇప్పుడు యూట్యూబ్‌లో చూడొచ్చు
The Lady Killer Movie,
Basha Shek
|

Updated on: Jan 18, 2026 | 8:43 AM

Share

కొన్ని సినిమాలు విడుదలైన వెంటనే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తాయి. అదేమసమయంలో మరి కొన్ని సినిమాలు అంచనాలు అందుకోలేక బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడుతున్నాయి. ఇప్పుడు మనం బాక్సాఫీస్ వద్ద అతి తక్కువ వసూళ్లు సాధించిన అలాంటి ఒక సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రతి సంవత్సరం, బాలీవుడ్‌లో చాలా భారీ బడ్జెట్ సినిమాలు విడుదలవుతాయి. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తాయి, మరికొన్ని అంచనాలకు విరుద్ధంగా ఘోరంగా విఫలమవుతాయి. అయితే, 2023లో విడుదలైన ‘ది లేడీ కిల్లర్’ చిత్రం ఎంతటి భారతీయ సినిమాల్లో అతిపెద్ద పరాజయాలలో ఒకటిగా నిలిచింది. అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్ వంటి ప్రముఖ నటులు నటించిన ఈ సినిమాను 45 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం 60,000 రూపాయలు మాత్రమే వసూలు చేసింది. అంటే నిర్మాతలు సినిమా బడ్జెట్‌లో 0.0001 శాతం మాత్రమే వెనక్కు వచ్చింది.

‘ది లేడీ కిల్లర్’ ఒక క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. అయితే, అది ఎప్పుడు విడుదలైందో కూడా ప్రేక్షకులకు తెలియదు. మొదటి రోజు కేవలం 293 టిక్కెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. తరువాతి కొన్ని రోజుల్లో, ఈ సంఖ్య ఏదో విధంగా 500 టిక్కెట్లకు చేరుకుంది, కానీ ఆ తర్వాత సినిమాను థియేటర్ల నుంచి తొలగించారు. ఈ సినిమా కథానాయకుడు అర్జున్ కపూర్ ఒక ప్రముఖ నిర్మాత కుటుంబానికి చెందినవాడు కాగా, భూమి పెడ్నేకర్ జాతీయ అవార్డు గెలుచుకున్న నటి. ఇంత పెద్ద స్టార్లు ఉన్నప్పటికీ, ‘ది లేడీ కిల్లర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది.భారీ బడ్జెట్, తక్కువ వసూళ్లు, తక్కువ టిక్కెట్ల అమ్మకాల కారణంగా, ‘ది లేడీ కిల్లర్’ సినిమాను నేడు భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద బాక్సాఫీస్ పరాజయంగా పరిగణిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా థియేటర్లలో అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన ఈ సినిమాను ఏ ఓటీటీ సంస్థ కూడా కొనుగోలు చేయలేదు. దీంతో ఈ సినిమాను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు మేకర్స్.

 ది లేడీ కిల్లర్ సినిమాలో భూమి పెడ్నేకర్, అర్జున్ కపూర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.