AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Box Office: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సమరం.. 5 సినిమాల మధ్య మొదలైన అసలైన యుద్ధం!

ప్రతి వారం బాక్సాఫీస్ దగ్గర సినిమాల సందడి ఉంటుంది. అయితే పండుగ సమయంలో సందడి హడావిడి వేరు. అందులోనూ సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలపై అంచనాలు భారీగా ఉంటాయి. ఈ సంక్రాంతికి స్టార్ హీరోల సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి బాగానే సందడి చేశాయి.

Box Office: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సమరం.. 5 సినిమాల మధ్య మొదలైన అసలైన యుద్ధం!
Rajasaab & Msv
Nikhil
|

Updated on: Jan 18, 2026 | 7:47 AM

Share

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 2026 సంక్రాంతి ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోనుంది. ఒకేసారి ఐదుగురు స్టార్ హీరోలు బాక్సాఫీస్ బరిలోకి దిగడం ప్రేక్షకులకు కన్నుల పండువగా మారింది. ఒక్కో చిత్రం ఒక్కో జోనర్‌లో ఉంటూ సినీ ప్రియులను అలరిస్తోంది. ప్రస్తుతం థియేటర్ల వద్ద ఉన్న రద్దీని బట్టి చూస్తే, ఈ ఏడాది టాలీవుడ్ సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ ఐదు సినిమాల పర్ఫార్మెన్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం.

1. ది రాజాసాబ్

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి సందడిని ముందే మొదలుపెట్టింది. జనవరి 09న విడుదలైన ఈ హారర్-కామెడీ డ్రామా ప్రభాస్ మాస్ ఫాలోయింగ్‌ను మరోసారి నిరూపించింది. కథపై కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ, ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ మరియు హారర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. మొదటి వారంలోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.238 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది.

2. మన శంకర వరప్రసాద్

మెగాస్టార్ చిరంజీవి మరియు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను కట్టిపడేస్తోంది. చిరంజీవి లోని వింటేజ్ కామెడీ టైమింగ్, గ్రేస్ ఫుల్ డాన్సులు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కేవలం 5 రోజుల్లోనే ఈ చిత్రం రూ.200 కోట్ల క్లబ్‌లో చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇండియాలోనే సుమారు రూ.120 కోట్ల గ్రాస్ సాధించి మెగాస్టార్ మ్యాజిక్ ఏంటో మరోసారి చూపించింది.

Bmv

Bmv

3. భర్త మహాశయులకు విజ్ఞప్తి

మాస్ రాజా రవితేజ ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అని ఈ సినిమా నిరూపిస్తోంది. సంక్రాంతి రేసులో భారీ సినిమాలు ఉన్నా, రవితేజ తనదైన కామెడీ మార్కుతో ప్రేక్షకులను నవ్విస్తున్నారు. ఈ చిత్రం మొదటి 4 రోజుల్లో సుమారు రూ.8.60 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ముఖ్యంగా యువత ఈ సినిమాలోని కామెడీ సీక్వెన్స్‌లకు ఫిదా అవుతున్నారు.

Aor

Aor

4. అనగనగా ఒక రాజు

నవీన్ పోలిశెట్టి అంటేనే మినిమం గ్యారెంటీ కామెడీ అనే నమ్మకాన్ని ఈ సినిమా నిలబెట్టింది. ‘అనగనగా ఒక రాజు’ చిత్రంతో నవీన్ మరోసారి థియేటర్లను నవ్వుల మయం చేశారు. ఈ సినిమా 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.42 కోట్లకు పైగా గ్రాస్ సాధించి, నవీన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌ను నమోదు చేసింది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

Nnnm

Nnnm

5. నారీ నారీ నడుమ మురారి

శర్వానంద్ మరియు రామ్ అబ్బరాజు కలయికలో వచ్చిన ఈ క్లీన్ ఫ్యామిలీ డ్రామా సైలెంట్‌గా వచ్చి సెన్సేషన్ సృష్టిస్తోంది. తక్కువ థియేటర్లలో విడుదలైనప్పటికీ, సినిమాలోని కంటెంట్ మరియు కామెడీ వల్ల మౌత్ టాక్ పెరిగింది. దీనివల్ల వసూళ్ల శాతం క్రమంగా పెరుగుతూ, 3 రోజుల్లో సుమారు రూ.5.8 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కుటుంబ సభ్యులతో కలిసి చూడదగ్గ సినిమా కావడంతో వీకెండ్‌లో మరిన్ని వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి 2026 సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఒక హెల్తీ కాంపిటీషన్ కనిపిస్తోంది. కంటెంట్ ఉన్న ప్రతి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తూ టాలీవుడ్‌ను లాభాల బాటలో నడిపిస్తున్నారు.