రూ.1200కోట్ల హీరోయిన్ మనసు దోచిన టాలీవుడ్ హీరో! తెలుగు సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన బ్యూటీ
చాలామందికి ఆమె చైల్డ్ ఆర్టిస్ట్‌గానే గుర్తుంది. కానీ ఇప్పుడు ఆ చిన్నారి పెరిగి పెద్దదై గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసే రేంజ్‌కు ఎదిగింది. ఇటీవలే బాలీవుడ్‌లో విడుదలైన ఒక సినిమా ఏకంగా 1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది.

భారీ హిట్ సినిమాలో తన నటనతో అందరినీ మంత్రముగ్ధులను చేసిన ఆ బ్యూటీ, ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. ఈ క్రమంలో తన మనసులోని మాటను బయటపెట్టి అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. తెలుగులో తన ఫేవరెట్ హీరో ఎవరో వెల్లడిస్తూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ 1200 కోట్ల భామ ఎవరో, ఆమె మనసు గెలుచుకున్న ఆ టాలీవుడ్ స్టార్ ఎవరో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఆ నటి మరెవరో కాదు.. ‘దురంధర్’ సెన్సేషన్ సారా అర్జున్.
భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ సరికొత్త నటీనటులతో తెరకెక్కించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ ‘యుఫోరియా’. ఫిబ్రవరి 6న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సారా మాట్లాడుతూ తన వ్యక్తిగత ఇష్టాలను పంచుకున్నారు. అందులో భాగంగా తన ఫేవరెట్ హీరో విజయ్ దేవరకొండ అని తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. రౌడీ స్టార్ పై తనకున్న అభిమానాన్ని చాటుకోవడంతో విజయ్ ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు.

Vijay And Sara
దురంధర్‌తో సంచలనం..
సారా అర్జున్ ‘యుఫోరియా’ సినిమాను ఏడాది క్రితమే అంగీకరించారు. అయితే ఈ సినిమా వాయిదాలు పడుతూ వస్తుండగా, ఈలోపే ఆమె నటించిన బాలీవుడ్ మూవీ ‘దురంధర్’ విడుదలైంది. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా అంచనాలకు మించి 1200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సారా అర్జున్ క్రేజ్‌ను స్కై హైకి తీసుకెళ్లింది. ఇప్పుడు అదే క్రేజ్‌తో ఆమె టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతుండటంతో ‘యుఫోరియా’పై అంచనాలు భారీగా పెరిగాయి.
డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో..
ఈ సినిమా కేవలం రొమాంటిక్ డ్రామా మాత్రమే కాదు, సమాజంలో కుర్రకారును వేధిస్తున్న డ్రగ్స్ సమస్య చుట్టూ సాగే పవర్‌ఫుల్ థ్రిల్లర్. కంటికి రెప్పలా కాపాడుకున్న కొడుకు డ్రగ్స్ వలలో చిక్కుకుంటే, ఆ తల్లి తన బిడ్డను కాపాడుకోవడానికి చేసే పోరాటమే ఈ సినిమా అని ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. భూమికా చావ్లా తల్లి పాత్రలో కనిపిస్తుండగా, సారా అర్జున్ ఒక కీలక పాత్రలో మెప్పించబోతున్నారు. గుణశేఖర్ మార్క్ టేకింగ్ ఈ సినిమాలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
గ్లోబల్ స్థాయిలో హిట్ అందుకున్న సారా అర్జున్, ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీతో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. తన ఫేవరెట్ హీరో విజయ్ దేవరకొండతో భవిష్యత్తులో ఆమె జంటగా నటించే అవకాశం వస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి డ్రగ్స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ ‘యుఫోరియా’ గుణశేఖర్‌కు పూర్వవైభవం తీసుకువస్తుందో లేదో తెలియాలంటే ఫిబ్రవరి 6 వరకు ఆగాల్సిందే.
