Kiara Advani: అనవసరమైన ట్రోలింగ్ ఇది.. హీరో ఉంటే ఇలా చేయ్యరేమో.. కియారా అద్వానీ షాకింగ్ కామెంట్స్..
ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం పూర్తిగా పెరిగిపోయింది. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఇంటర్నెట్ను తెగ వాడేస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం పూర్తిగా పెరిగిపోయింది. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఇంటర్నెట్ను తెగ వాడేస్తున్నారు. ఇక స్మార్ట్ ఫోన్ వాడకం పెరగడంతో అభిమానులకు .. హీరోహీరోయిన్లకు మధ్య అనుబంధం మరింత దగ్గరయ్యింది. అభిమానులకు.. సెలబ్రెటీలకు మధ్య వారధిగా ఇంటర్నెట్ మారిపోయింది. ఈ క్రమంలో తమకు ఇష్టమైన హీరోహీరోయిన్లకు సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అదే సమయంలో హీరోహీరోయిన్స్ నుంచి ఏ చిన్న పొరపాటు కనిపించినా.. దారుణంగా కామెంట్స్ చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో హీరోయిన్స్ విషయంలో ట్రోలింగ్ ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది. ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ విపరీతంగా ట్రోల్ చేస్తుంటారు. ఇటీవల పలువురు స్టార్ హీరోయిన్స్ ట్రోలింగ్గు గురైనవారున్నారు. తాజాగా తన విషయంలో జరిగిన ట్రోలింగ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వాని.
కబీర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఫుల్ జోష్ మీదున్నారు కియారా అద్వానీ.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. అయితే కియారా అద్వానీ.. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమలో ఉన్నట్లుగా గత రోజులుగా టాక్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. అందుకు తగినట్టుగానే వీరిద్దరు పలుమార్లు కలిసి బయటకు రావడం… తిరగడం కూడా జరిగింది. అయితే గతంలో ఓసారి కియారా అద్వానీ.. సిద్ధార్థ్ ఇంటికి వెళ్లిన సమయంలో ట్రోలింగ్ బారీన పడింది. సిద్ధార్థ్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లగానే అక్కడే ఉన్న సెక్యూరిటీ డ్యూటీలో ఉన్న వృద్ధుడు ఆమె కార్ డోర్ తెరచి ఆమెకు సెల్యూట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కియారా ప్రవర్తనపై దారుణంగా కామెంట్స్ చేశారు. కారు డోరు కూడా తీసుకోవడం చేతకాదా ? ముసలి వాళ్లతో ఇలాంటి పనులు చేయించుకోవడం సిగ్గుచేటు అంటూ కామెంట్స్ చేశారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కియారా తనపై జరిగిన ట్రోలింగ్ గురించి స్పందించింది. నా స్థానంలో ఒక హీరో ఉండి ఉంటే ఇలాంటి కామెంట్స్ చేసేవాళ్లు కాదేమో. అయినా ఎవరు సెల్యూ్ట్ చేయమని అడగరు. ఆయన సెక్యూరిటీ గార్డ్ కాబట్టి స్వతహాగా అలా చేశారు. కారులోంచి దిగుతుండగా..ఫోటోగ్రాఫర్స్ వీడియో తీసి తెగ వైరల్ చేశారు. నిజానికి ఇది అనవసమరైన ట్రోలింగ్ అంటూ చెప్పుకొచ్చింది కియారా.
Also Read: RRR Pre Release Event: చెన్నైలో RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో
Salman Khan: కరిచిన పాము కూడా నా ఫ్రెండే.. పాము ఎలా కాటేసిందో వెల్లడించిన సల్లూ భాయ్..
RRR Movie: సినిమాకే హైలైట్‌గా రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్.. 2 వేల మంది జూనియర్ ఆర్టిస్ట్‌లతో..
Akhil Akkineni: అయ్యగారూ.. కింగ్ అంతే.. కండలు తిరిగిన దేహంతో అఖిల్.. ఫిదా అవుతోన్న ఫ్యాన్స్..
Balakrishna: యాదాద్రి పునర్నిర్మాణంలో కేసీఆర్ చొరవ ప్రశంసనీయం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు