AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సిల్వర్ స్క్రీన్ పై ఖాన్ త్రయం కలిసి నటించానున్నారా..! అభిమాని కోరికపై అమీర్ ఖాన్ స్పందన ఏమిటంటే

గతేడాది షారుక్‌, సల్మాన్‌ కలిసి రెండు సినిమాల్లో నటించారు. ఇద్దరు ఖాన్‌లను కలిసి చూసిన అభిమానుల నుంచి ఇంత స్పందన వచ్చింది. మరి ముగ్గురు ఖాన్‌లు - షారుక్, సల్మాన్, అమీర్ ఒకే చిత్రంలో కలిసి కనిపిస్తే ఏమి జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇటీవల అమీర్ ఖాన్ 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో'కి చేరుకున్నాడు. ఈ సమయంలో ప్రేక్షకుల నుంచి ఒకరు ముగ్గురు ఖాన్‌లను ఒకే చిత్రంలో చూడాలని తన కోరికను వ్యక్తం చేశారు.

సిల్వర్ స్క్రీన్ పై ఖాన్ త్రయం కలిసి నటించానున్నారా..! అభిమాని కోరికపై అమీర్ ఖాన్ స్పందన ఏమిటంటే
Khan Tastic Collaboration
Surya Kala
|

Updated on: May 01, 2024 | 7:46 AM

Share

బాలీవుడ్ స్టార్ హీరోస్ ఖాన్ త్రయం గురించి ఎంత చెప్పినా తక్కువే. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ లు గత ౩౦ ఏళ్లుగా తమ సినిమాలతో బాక్సాఫీసును ఏలుతూనే ఉన్నారు. గత ఏడాది బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ‘పఠాన్’, ‘జవాన్’, ‘డింకీ’ వరసగా మూడు సినిమాలతో బాక్సాఫీస్ మొత్తాన్ని షేక్ చేశాడు. అంతే కాదు సల్మాన్ ఖాన్ వి రెండు సినిమాలు కూడా విడుదలయ్యాయి. ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ , ‘టైగర్ 3’. మొదటి చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కాగా, రెండోది అనుకున్నంత బిజినెస్ చేయలేకపోయింది. ఇద్దరు ఖాన్‌లు గత సంవత్సరం సిల్వర్ స్క్రీన్‌పై కనిపించారు. అయితే అమీర్ ఖాన్ మాత్రం తన అభిమానులు మిస్ అయ్యాడు. అయితే మరో బిగ్ సినిమాతో ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనున్నాడు.

గతేడాది షారుక్‌, సల్మాన్‌ కలిసి రెండు సినిమాల్లో నటించారు. ఇద్దరు ఖాన్‌లను కలిసి చూసిన అభిమానుల నుంచి ఇంత స్పందన వచ్చింది. మరి ముగ్గురు ఖాన్‌లు – షారుక్, సల్మాన్, అమీర్ ఒకే చిత్రంలో కలిసి కనిపిస్తే ఏమి జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

ముగ్గురు ఖాన్‌లు ఒకే సినిమాలో కనిపిస్తారా?

ఇవి కూడా చదవండి

ఇటీవల అమీర్ ఖాన్ ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’కి చేరుకున్నాడు. ఈ సమయంలో ప్రేక్షకుల నుంచి ఒకరు ముగ్గురు ఖాన్‌లను ఒకే చిత్రంలో చూడాలని తన కోరికను వ్యక్తం చేశారు. ఈ ప్రశ్నపై అమీర్ ఖాన్ మాట్లాడుతూ, మీ ఆలోచన, నా ఆలోచనలు సరిగ్గా ఒకేలా ఉన్నాయి. ఈ సందర్భంగా తన కోరిక గురించి కూడా చెప్పాడు. పరిశ్రమలో తన సుదీర్ఘ కెరీర్‌ను దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి ప్రాజెక్ట్ ఉండాలని అతను చెప్పడం కనిపించింది.

“నేను ఇటీవల షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లను కలిశాను. ఈ సందర్భంగా మా ముగ్గురం చాలా ఏళ్లుగా ఒకే ఇండస్ట్రీలో ఉన్నామని చెప్పాను. మరి ఈ కెరీర్‌లో మనం కలిసి ఒక్క సినిమా కూడా చేయకపోతే ఎలా ప్రేక్షకుల కోసం మనం సినిమా తీయాలి’’ అని చెప్పినట్లు వెల్లడించాడు అమీర్ ఖాన్.

ఈ సందర్భంగా అమీర్ ఖాన్ మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ తనకు ఓ గిఫ్ట్ ఇచ్చాడు. ఇది బీయింగ్ హ్యూమన్ బ్రాండ్ డెనిమ్. ఇటీవల అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌లో ముగ్గురు ఖాన్‌లు ఒకే వేదికపై డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ముగ్గురి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి ఈ ముగ్గురిని ఒకే సినిమాలో చూడాలని అందరూ ఆశిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నలభై ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపాలు.. ఎక్కడంటే
నలభై ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపాలు.. ఎక్కడంటే
14 ఏళ్లకే హీరోయిన్.. స్టార్ హీరోతో చేదు అనుభవం..
14 ఏళ్లకే హీరోయిన్.. స్టార్ హీరోతో చేదు అనుభవం..
IMDB-2025 రిపోర్ట్.. ఈ ఏడాది టాప్ 10 సినిమాలు, వెబ్ సిరీస్‌లివే.
IMDB-2025 రిపోర్ట్.. ఈ ఏడాది టాప్ 10 సినిమాలు, వెబ్ సిరీస్‌లివే.
అయ్యో.. ఇంట్లో ఆడుకుంటూ టూత్‌పేస్ట్‌ తిన్న పిల్లోడు.. కాసేపటికే
అయ్యో.. ఇంట్లో ఆడుకుంటూ టూత్‌పేస్ట్‌ తిన్న పిల్లోడు.. కాసేపటికే
శరీరంలోని ఈ భాగాల్లో నొప్పి వస్తుందా..? మీ కిడ్నీలు దెబ్బతిన్నట్ల
శరీరంలోని ఈ భాగాల్లో నొప్పి వస్తుందా..? మీ కిడ్నీలు దెబ్బతిన్నట్ల
విమానాలలో పనిచేసే పురుషులను ఏమని పిలుస్తారో తెలుసా?
విమానాలలో పనిచేసే పురుషులను ఏమని పిలుస్తారో తెలుసా?
కొత్త రూల్స్.. ట్రైన్ టికెట్లు బుకింగ్‌కు ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్
కొత్త రూల్స్.. ట్రైన్ టికెట్లు బుకింగ్‌కు ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్
పాకిస్తాన్ పార్లమెంటు సభ్యుల కక్కుర్తి గిట్లుంటది..!
పాకిస్తాన్ పార్లమెంటు సభ్యుల కక్కుర్తి గిట్లుంటది..!
ఓటు వేసేందుకు వెళ్లి.. బ్యాలెట్ పేపర్లను నమిలి మింగేసిన మందుబాబు!
ఓటు వేసేందుకు వెళ్లి.. బ్యాలెట్ పేపర్లను నమిలి మింగేసిన మందుబాబు!
వెజిటేరియన్లను వేధించే సమస్య.. ఈ టిప్స్ పాటిస్తే వెంటనే రిజల్ట్!
వెజిటేరియన్లను వేధించే సమస్య.. ఈ టిప్స్ పాటిస్తే వెంటనే రిజల్ట్!