Dhanush: వారంటే నాకెంతో ఇష్టం, అవకాశం వస్తే వారి బయోపిక్‌లో నటిస్తా.. ధనుష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.

Narender Vaitla

Narender Vaitla | Edited By: Anil kumar poka

Updated on: Dec 27, 2021 | 7:08 PM

Dhanush: 2002లో తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమైన ధనుష్‌ తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఓవైపు హీరోయిజానికి స్కోప్‌ ఉన్న చిత్రాల్లో నటిస్తూనే..

Dhanush: వారంటే నాకెంతో ఇష్టం, అవకాశం వస్తే వారి బయోపిక్‌లో నటిస్తా.. ధనుష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.

Dhanush: 2002లో తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమైన ధనుష్‌ తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఓవైపు హీరోయిజానికి స్కోప్‌ ఉన్న చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనూ నటిస్తూ ఎన్నో అవార్డులను దక్కించుకున్నారు. ఇక కేవలం కేవలం తమిళానికే పరిమితం కాకుండా ఇతర భాషల్లోనూ నటిస్తూ మెప్పిస్తున్నారు ధనుష్‌. మొదట్లో డబ్బింగ్ సినిమాలతో ఇతర భాషల్లో తళుక్కుమన్న ధనుష్‌ ఆ తర్వాత నేరుగా ఇతర భాషల్లో సినిమాలు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే తెలుగు, హిందీతో పాటు ఏకంగా హాలీవుడ్‌ చిత్రాల్లోనూ నటిస్తున్నారు ధనుష్‌.

ఈ క్రమంలోనే ధనుష్‌ తాజాగా బాలీవుడ్‌లో ‘ఆత్రంగి రే’ అనే సినిమాలో నటిస్తున్నారు. అక్షయ్‌ కుమార్‌, ధనుష్‌, సారా అలీఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలైంది. డిసెంబర్‌ 24న విడుదలైన ఈ సినిమా ప్రమోషన్స్‌ కోసం ధనుష్‌ ప్రస్తుతం ముంబయిలో బిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు ధనుష్‌ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం బయోపిక్‌ ట్రెండ్‌ నడుస్తోంది కదా.. మరి మీరు ఎవరి బయోపిక్‌ సినిమాలో నటిస్తారు.? అని అడగ్గా..

ధనుష్‌ స్పందిస్తూ.. ‘నాకు రజినీకాంత్‌, ఇళయ రాజ గార్లంటే చాలా ఇష్టం.. ఇద్దరిపై ఎనలేని అభిమానం ఉంది. ఒకవేళ బయోపిక్‌లో నటించే అవకాశం వస్తే.. వీరిద్దరి బయోపిక్స్‌లో నటించాలని ఉంది’ అంటూ తన మనసులో మాటను బయటపెట్టారు ధనుష్‌. ఇదిలా ఉంటే ఇప్పటికే శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఓ తెలుగు స్ట్రెయిట్‌ మూవీ మొదలు పెట్టిన ధనుష్‌, మరో తెలుగు సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

Also Read: Train Fire Breaks: కాస్‌గంజ్‌ ప్యాసింజర్‌ రైలులో మంటలు.. మూడు బోగీలు అగ్నికి ఆహుతి..!

PM Narendra Modi: నేడు హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రధాని పర్యటన.. రూ. 11వేల కోట్ల ప్రాజెక్టులకు శంఖుస్థాపనలు

Sunny Leone: ఆ వీడియో డిలీట్ చేయాల్సిందే.. లేకుంటే కఠిన చర్యలు.. సన్నీ లియోన్‌కు హోంమంత్రి వార్నింగ్‌..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu