Tollywood : అప్పుడు తోపు హీరోయిన్.. ఇప్పుడు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్.. సినిమాలు వదిలేసి ఐపీఎస్‌గా మారిన బ్యూటీ..
నటీనటులుగా గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలతో సినీరంగంలోకి అడుగుపెట్టినవారు చాలా మంది ఉన్నారు. మరికొందరు మాత్రం వేరే రంగంలో సత్తా చాటాలని అనుకుని అనుకోకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ ఓ బ్యూటీ మాత్రం సినిమాలు వదిలేసి ఇప్పుడు పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ గా మారింది. ఇప్పుడు ఆమె పోలీస్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరంటే..

బాలీవుడ్ సినీరంగంలో అగ్ర కథానాయికగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ షో కాకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పించింది. అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది. హిందీలో ఎన్నో సినిమాల్లో సహజ నటనతో కట్టిపడేసిన ఈ వయ్యారి.. ఇప్పుడు సినిమాలు వదిలేసి దేశసేవ చేస్తోంది. కొన్నాళ్లుగా డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఐపీఎస్ అధికారిగా తన బాధ్యతలు నిర్వహిస్తుంది. ఒకప్పుడు తోపు హీరోయిన్ అయిన ఆమె.. ఇప్పుడు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? సిమల ప్రసాద్. తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేదు. కానీ నార్త్ అడియన్స్ ఫేవరేట్ హీరోయిన్. భోపాల్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ హిందీలో ఎన్నో చిత్రాల్లో నటించింది. అప్పట్లో తన అందాలతో సినీరంగుల ప్రపంచంలో చక్రం తిప్పింది. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తితో నాట్యం, నటన పాఠాలు నేర్చుకుంది.
కాలేజీ రోజుల్లోనే పలు నాటకాల్లో కనిపించింది. 2019లో విడుదలైన నకాష్, అలీఫ్ చిత్రాల్లో ప్రధాన పాత్రలలో నటించి మెప్పించింది. ఇటు సినిమాలు చేస్తూనే అటు రాజకీయాలు, సామాజిక శాస్త్రంపై ఆసక్తి పెంచుకుంది. దీంతో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి మొదటి ప్రయత్నంలోనే పీఎస్సీలో ఉత్తీర్ణత సాధించింది సిమల. ఆ తర్వాత ఆమెకు DSPగా పోస్టింగ్ వచ్చింది. ఇటు సినిమాలు తగ్గించి పూర్తిగా దేశసేవ చేసేందుకు మొగ్గు చూపింది.
ఎలాంటి కోచింగ్, ట్రైనింగ్ లేకుండానే యూపీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి.. మంచి ర్యా్ంక్ సాధించింది. అప్పటి నుంచి IPS అధికారిగా సేవలు అందిస్తుంది. 1980లో అక్టోబర్ 8న భోపాల్ నగరంలో జన్మించిన సిమల.. మంచి డ్యాన్సర్. చిన్నప్పటి నుంచి నాటకాల్లో చురుగ్గా పాల్గొనేది. సిమల తండ్రి భగీరథ్ ప్రసాద్ సైతం ఐఏఎస్ అధికారి కావడం విశేషం. తండ్రి అడుగుజాడల్లోనే కూతురు సైతం ఐపీఎస్ అధికారిగా స్థిరపడ్డారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :



