AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kantara: ‘పుష్ప, కాంతార సినిమాలు ఇండస్ట్రీని నాశనం చేస్తున్నాయి’.. బాలీవుడ్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..

తాజాగా సౌత్ మూవీస్ వల్లే బాలీవుడ్ ఇండస్ట్రీ నాశనం అవుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు డైరెక్టర్ అనురాగ్ కశ్యప్.

Kantara: 'పుష్ప, కాంతార సినిమాలు ఇండస్ట్రీని నాశనం చేస్తున్నాయి'.. బాలీవుడ్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..
Anurag Kashyap
Rajitha Chanti
|

Updated on: Dec 12, 2022 | 2:10 PM

Share

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సౌత్ మూవీస్ హావా నడుస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘన విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత పుష్ప, కేజీఎఫ్ 2 సినిమాలు భారీగా వసూళ్లు రాబట్టాయి. ఇక ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన కాంతార సృష్టించిన ప్రభంజనం గురించి తెలిసిందే. దీంతో సౌత్ సినిమాలపై నార్త్ ఆడియన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే దక్షిణాది ఫిల్మ్ మేకర్స్ ప్రతి సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఓవైపు బాక్సాఫీస్ వద్ద సౌత్ సినిమాలు సత్తా చాటుతుండగా.. బాలీవుడ్ చిత్రాలు మాత్రం డిజాస్టర్స్ గా నిలుస్తు్న్నారు. భారీ అంచనాల మధ్య నిర్మించిన సినిమాలు నష్టాలను మిగిల్చాయి. బ్రహ్మాస్త్ర, లాల్ సింగ్ చద్దా వంటి సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో అదును చూసి సౌత్ సినిమాలపై బాలీవుడ్ మేకర్స్ తమ సంచనల కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా సౌత్ మూవీస్ వల్లే బాలీవుడ్ ఇండస్ట్రీ నాశనం అవుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు డైరెక్టర్ అనురాగ్ కశ్యప్.

” ప్రస్తుతం ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతుంది. దీంతో బాలీవుడ్ మేకర్స్ కూడా అలాంటి చిత్రాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలు చేయడం వలనే బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నాశం అవుతుంది. కేజీఎప్, కాంతార, పుష్ సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా భారీ విజయాలను అందుకోవచ్చు. అలాంటి చిత్రాలనే కాపీ చేయాలని బీటౌన్ మేకర్స్ ట్రై చేయడం వలన భారీ నష్టాలు వస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ కు పాన్ ఇండియా సినిమాలు కావు.. ఇండస్ట్రీకి దైర్యాన్ని ఇచ్చే సినిమాలు చేయాల్సిన అవసరం ఉంది. మరాఠీ మూవీగా వచ్చిన సైరత్ ఫాన్ ఇండియా లెవల్లో ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. తక్కువ బడ్జెట్ తో తీసిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో అందరూ అదే పంథాను ఫాలో అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

కొత్త కథలను తీసుకురావడం లేదు. సైరత్ సినిమా కారణంగా మరాఠీ పరిశ్రమ నాశనం అవుతుంది. ఈ విషయం గురించి నేను ఆ దర్శకుడితో మాట్లాడాను. ఇప్పుడు కథలలో కొత్తదనం కావాలి. అప్పుడే సినిమాలు హిట్ అవుతాయి అంటూ చెప్పుకొచ్చారు అనురాగ్ కశ్యప్. ఆయన చేసిన కామెంట్స్ ఫిల్మ్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారాయి. చూడాలి మరీ.. అనురాగ్ మాటలపై సౌత్ మేకర్స్ ఎలా స్పందిస్తారో.

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై