Akshay Kumar: ఖరీదైన బంగ్లాను అమ్మేసిన స్టార్‌ హీరో.. కారణమేంటంటే?

బాలీవుడ్‌లో వేగంగా సినిమాలు చేయడంలో హీరో అక్షయ్‌కుమార్‌ (Akshay Kumar) ముందుంటాడు. ఏడాదిలో కనీసం 5 నుంచి 6 సినిమాల్లో నటిస్తుంటాడీ స్టార్‌ హీరో. సినిమా రిలీజుల విషయంలోనూ అసలు తగ్గడు.

Akshay Kumar: ఖరీదైన బంగ్లాను అమ్మేసిన స్టార్‌ హీరో.. కారణమేంటంటే?
Akshay Kumar
Follow us

|

Updated on: Sep 25, 2022 | 12:28 PM

బాలీవుడ్‌లో వేగంగా సినిమాలు చేయడంలో హీరో అక్షయ్‌కుమార్‌ (Akshay Kumar) ముందుంటాడు. ఏడాదిలో కనీసం 5 నుంచి 6 సినిమాల్లో నటిస్తుంటాడీ స్టార్‌ హీరో. సినిమా రిలీజుల విషయంలోనూ అసలు తగ్గడు. నెలల గ్యాప్‌లో తన చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాడు. ఇటీవల కట్‌పుత్లీ (Cuttputlli) సినిమాతో ఆకట్టుకున్న అక్షయ్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త బాలీవుడ్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. తనకున్న ఖరీదైన బంగ్లాలో ఒక్కదాన్ని ఈ హీరో అమ్మేశాడని తెలుస్తోంది. అంధేరి వెస్ట్‌లో ఉన్న అపార్ట్‌మెంట్‌ను దబూ మాలిక్ అనే వ్యక్తికి రూ. 6కోట్లకు అమ్మేసినట్లు ప్రచారం జరగుతోంది. కాగా ఇదే లగ్జరీ అపార్ట్‌మెంట్ణు గతంలో రూ.4.12 కోట్లు చెల్లించి అక్షయ్ కొనుగోలు చేశాడట.

కాగా ఈ ఖరీదైన బంగ్లాను కొన్న దబూ మాలిక్‌ మరెవరో కాదు ప్రముఖ సింగర్‌ అర్మాన్‌ మాలిక్‌ తండ్రే. అపార్ట్‌మెంట్ విక్రయానికి సంబంధించి ఇరు వర్గాల మధ్య ఒప్పందం కూడా పూర్తైందట. ట్రాన్స్‌కన్ ట్రయంఫ్ టవర్-1లో ఉన్న ఈ అపార్ట్‌మెంట్ 1281 చదరపు అడుగుల్లో విస్తరించి ఉంది. బాల్కనీ కూడా 59 అడుగులతో చాలా విశాలంగా ఉంటుందట. అయితే అక్షయ్‌ ఈ బంగ్లాను అమ్మేయడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇది గాక అక్షయ్‌కు ముంబైలో అంధేరీ వెస్ట్, ఈస్ట్, బొరివలీ, ములంద్, జుహు తదితర చోట్ల ఖరీదైన అపార్ట్‌మెంట్లు, బంగ్లాలు, ఆస్తులున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. రాక్షసుడు రీమేక్‌గా తెరకెక్కిన కట్‌పుత్లీ మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకోవడంతో అక్షయ్‌ ఆశలన్నీ ఇప్పుడు రాబోయే రామ్‌ సేతు సినిమాపైనే ఉన్నాయి. యాక్షన్‌ అడ్వెంచెరస్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుస్రత్ బరుచాతో పాటు టాలీవుడ్ హీరో సత్యదేవ్‌ ముఖ్య పాత్రల్లో నటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ