Ponniyin Selvan: ‘నా కూతురుకి ఆ అవకాశం దొరకడం చాలా గర్వంగా ఉంది’.. ఐశ్వర్య రాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ప్రమోషన్స్ ఈవెంట్లో పాల్గోన్న ఐశ్వర్య రాయ్.. పొన్నియిన్ సెల్వన్ సెట్ లో తన కూతురు ఆరాధ్య పాల్గోనడం.. మొదటిసారి పీరియాడికల్ డ్రామా చూడడం పట్ల ఆరాధ్య ఎలా ఎగ్జైట్ అయ్యిందో చెప్పుకొచ్చింది

Ponniyin Selvan: 'నా కూతురుకి ఆ అవకాశం దొరకడం చాలా గర్వంగా ఉంది'.. ఐశ్వర్య రాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Aishwarya rai
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 25, 2022 | 1:14 PM

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మణిరత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan). పీరియాడికల్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీలో చియాన్ విక్రమ్, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. సౌత్ టూ నార్త్ పలు ప్రధాన నగరాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహిస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు. ఇందులో భాగంగా.. తాజాగా ముంబైలో జరిగిన ప్రమోషన్స్ ఈవెంట్లో పాల్గోన్న ఐశ్వర్య రాయ్.. పొన్నియిన్ సెల్వన్ సెట్ లో తన కూతురు ఆరాధ్య పాల్గోనడం.. మొదటిసారి పీరియాడికల్ డ్రామా చూడడం పట్ల ఆరాధ్య ఎలా ఎగ్జైట్ అయ్యిందో చెప్పుకొచ్చింది.

ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్‏తో కలిసి ఆరాధ్య పొన్నియిన్ సెల్వన్ సెట్‏లో సందడి చేసింది. ఆ సమయంలో ఆరాధ్య స్పందన ఏమిటి అని ప్రశ్నించగా.. ” పొన్నియిన్ సెల్వన్ సెట్ చూసి ఆరాధ్య చాలా ఆకర్షితురాలైంది. ఒక పీరియాడికల్ డ్రామా మొదటి సారి చూడడంతో ఆమె చాలా ఎగ్జైట్ అయ్యింది. ప్రతి సన్నివేశం ఆమెను మంత్రముగ్దులను చేసింది. ఆమె కళ్లలో ఆ సంతోషం.. ఆశ్యర్యం నేను చూశాను. మణిరత్నం దర్శకత్వంలో మరోసారి పనిచేయడం నాకు చాలా సంతోషం. ఆయన పనితీరు చూసి ఆరాధ్య ఆశ్చర్యపోయింది.

ఆమె సెట్‏కు వచ్చినప్పుడు తనకు యాక్షన్ చెప్పమని అవకాశమిచ్చారు మణి సర్. ఆ అవకాశం ఇప్పటివరకు మాలో ఎవరికీ రాలేదు. అది ఆరాధ్య అత్యంత ప్రియమైన జ్ఞాపకం. తనకు రాబోయే సంవత్సరాలలో ఈ రోజులు చాలా విలువైనవిగా మారతాయి” అంటూ చెప్పుకొచ్చింది ఐశ్వర్య.

ఇవి కూడా చదవండి
Aishwarya

Aishwarya

పొన్నియిన్ సెల్వన్ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రూ. 500 కోట్ల బడ్జెట్‏తో ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో జయం రవి, ఐశ్వర్య లక్ష్మి, లాల్, శోభితా ధూళిపాళ్ల కీలకపాత్రలలో కనిపించనున్నారు. సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?