Vijay Devarakonda: ఆ రోజులను ఎప్పటికీ మర్చిపోలేను.. రౌడీ హీరోపై ప్రశంసలు కురిపించిన బాలీవుడ్ బ్యూటీ..
Vijay Devarakonda: ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో దక్షిణాది హీరోల హవా బాగా నడుస్తోంది. అక్కడి స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ దక్కించుకుంటున్నారు సౌత్ స్టార్స్. ముఖ్యంగా తెలుగు హీరోలు ముంబైలో దుమ్మురేపుతున్నారు. బాహుబలితో ప్రభాస్, పుష్పతో..
Vijay Devarakonda: ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో దక్షిణాది హీరోల హవా బాగా నడుస్తోంది. అక్కడి స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ దక్కించుకుంటున్నారు సౌత్ స్టార్స్. ముఖ్యంగా తెలుగు హీరోలు ముంబైలో దుమ్మురేపుతున్నారు. బాహుబలితో ప్రభాస్, పుష్పతో అల్లు అర్జున్, ట్రిపులార్‌తో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు బాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. కేవలం అక్కడి సినీ లవర్స్ మాత్రమే కాకుండా, హీరోయిన్స్ సైతం మన హీరోలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బాలీవుడ్ నటీమణులు కొందరు టాలీవుడ్ హీరోలను ఆకాశానికెత్తేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించింది. ఈ బ్యూటీ విజయ్‌తో ‘లైగర్’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న లైగర్ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయనున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఓ నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన అనన్య తనకు విజయ్ దేవరకొండతో ఏర్పడ్డ స్నేహబంధం గురించి చెప్పుకొచ్చింది. తాముద్దం సెట్‌లో ఎంతో సరాదాగా ఉండేవాళ్లమని చెప్పిన అనన్య.. అమెరికాలో లైగర్ షూటింగ్ జరిగిన రోజుల్ని ఎప్పటికీ మర్చిపోలేని తెలిపింది. ఇక విజయ్ చాలా మంచి వ్యక్తని, ఆయకు దయాగుణం ఎక్కువని పొగడ్తల వర్షం కురిపించింది. ఇక లైగర్ సినిమాలో మైక్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు కరణ్ జోహర్ కూడా నిర్మాణ బాధ్యతలు చేపట్టడంతో లైగర్‌పై భారీగా అంచనాలు పెరిగాయి.