AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dharmendra: బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూత.. శోక సంద్రంలో ఇండస్ట్రీ

బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మేంద్ర నేడు కన్నుమూశారు. దాంతో బాలీవుడ్ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది.  నటుడు ధర్మేంద్ర పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో కనుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మేంద్రను కొద్దిరోజుల క్రితమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు.

Dharmendra: బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూత.. శోక సంద్రంలో ఇండస్ట్రీ
Dharmendra
Rajeev Rayala
|

Updated on: Nov 24, 2025 | 2:06 PM

Share

బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మేంద్ర నేడు కన్నుమూశారు. దాంతో బాలీవుడ్ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది.  నటుడు ధర్మేంద్ర పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో కనుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మేంద్రను కొద్దిరోజుల క్రితమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. ధర్మేంద్ర నివాసానికి చేరుకున్నారు కుటుంబసభ్యులు , బంధువులు. ధర్మేంద్ర నివాసం దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. పలువురు ప్రముఖులు కూడా ఆయన నివాసం దగ్గరకు చేరుకున్నారు. ధర్మేంద్ర భార్య హేమామాలిని కూడా విల్లా పార్లే లోని ఆయన నివాసానికి వచ్చారు.

ధర్మేంద్ర నివాసానికి ఆయన కూతురు ఇషా డియోల్‌ చేరుకున్నారు.  ధర్మేంద్ర కోలుకోవాలని ఆయన అభిమానులు చాలా రోజుల నుంచి పూజలు కూడా చేశారు. కానీ ఆ పూజలు ఫలించలేదు. 89 ఏళ్ల ధర్మేంద్ర పంజాబ్‌ లోని నస్రాలిలో జన్మించారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు ధర్మేంద్ర. ముఖ్యంగా షోలే సినిమా ఆయనకు ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక ధర్మేంద్ర మృతికి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ధర్మేంద్ర మృతి వార్త విని ఆయన అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు.

ఆరు దశాబ్దాలకు పైగా తన నటనతో మైమ్పరించారు ధర్మేంద్ర. వృద్ధాప్య సమస్యలు, తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులతో ధర్మేంద్ర కన్నుమూశారు. కొన్ని రోజుల కింద ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. 1935, డిసెంబరు 8న పంజాబ్‌లోని నస్రలీ గ్రామంలో జన్మించిన ధర్మేంద్ర.. 1960లో దిల్ భీ తేరా హమ్ భీ తేరా చిత్రంతో అరంగేట్రం చేశారు. కెరీర్ తొలినాళ్లలో సాఫ్ట్, రొమాంటిక్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్నారు. 1970వ దశకంలో హీ మ్యాన్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆంఖే, షికార్, మేరా గావ్ మేరా దేశ్, యాదోంకీ బారాత్, దోస్త్, షోలే, ధరమ్ వీర్ లాంటి సినిమాలతో స్టార్‌గా మారారు ధర్మేంద్ర.

యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతమైన పట్టు, ఫిజిక్‌తో మెప్పించారు ధర్మేంద్ర. కాగా 1997లో ప్రతిష్ఠాత్మక ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు. అలాగే 2012లో భారత ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్ పురస్కారం అందుకున్నారు. ఇక ఇండియన్ సినిమా ఎవర్ గ్రీన్ హిట్ షోలేలో అమితాబ్‌తో కలిసి నటించిన ధర్మేంద్ర.. అందులో వీరూ పాత్రకు ప్రేక్షకుల నీరాజనం పట్టారు. ధర్మేంద్రకు ఇద్దరు భార్యలు.. తొలి భార్య ప్రకాశ్ కౌర్, రెండో భార్య హేమా మాలిని.  1980లో డ్రీమ్ గర్ల్ హేమమాలినిని వివాహం చేసుకున్నారు ధర్మేంద్ర.. ధర్మేంద్ర వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు సన్నీ డియోల్, బాబీ డియోల్.  రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు ధర్మేంద్ర. 2004-09 మధ్యలో బిజేపీ నుంచి ఎంపీగా సేవలందించారు.  టెలివిజన్ రంగంలోనూ ధర్మేంద్ర అడుగు.. ఇండియాస్ గాట్ టాలెంట్ షోకు జడ్జిగా వ్యవహరించారు. తాజ్ డివైడెడ్ బై బ్లడ్ అనే సీరియల్‌లో నటించారు ధర్మేంద్ర.

ధర్మేంద్ర మృతి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us