Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: స్టార్ హీరో.. కోట్లాది ఆస్తులు.. కట్ చేస్తే.. రోడ్లపై వడపావ్ అమ్ముతున్న వైనం.. వీడియో

ఇతను పాన్ ఇండియా యాక్టర్. ప్రపంచ వ్యాప్తంగా ఈ హీరోకు గుర్తింపు ఉంది. కోట్లాది ఆస్తులున్నాయి. అయితే ఉన్నట్లుండి ఈ నటుడు రోడ్డున పడ్డాడు. రోడ్లపై వడపావ్ అమ్ముతూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

Tollywood: స్టార్ హీరో.. కోట్లాది ఆస్తులు.. కట్ చేస్తే.. రోడ్లపై వడపావ్ అమ్ముతున్న వైనం.. వీడియో
Bollywood Actor
Follow us
Basha Shek

|

Updated on: Jun 08, 2025 | 11:56 AM

గత కొన్ని రోజులుగా ఈ నటుడు వరుసగా వార్తల్లో నిలుస్తున్నాడు. సినిమాలతో పాటు తన వ్యక్తిగత జీవితంతో తరచూ ట్రెండింగ్ లో ఉంటున్నాడు. తాజాగా ఈ పాన్ ఇండియా నటుడు ముంబై రోడ్లపై నిలబడి వడ పావ్ అమ్ముతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు షాక్ అవుతున్నారు. స్టార్ హీరో ఉన్నట్లుండ రోడ్డున పడడమేంటి? అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇదే స్టార్ నటుడు గతంలో రోడ్లపై బిక్షగాడిలా మారువేశమేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చాడు. తన సినిమా ప్రమోషన్ల కోసమే ఇలా వింతగా ప్రవర్తించాడని తెలిసి ఫ్యాన్స్‌ నోరెళ్ల బెట్టారు. ఇప్పుడు కూడా తన అప్ కమింగ్ సినిమా ప్రమోషన్ కోసమే ఇలా చేశాడని స్పష్టంగా తెలుస్తుంది. దీంతో నెటిజన్లు అతనిపై మండిపడుతున్నారు. నెగెటివ్ కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్.

ఇవి కూడా చదవండి

నటుడు ఆమిర్ ఖాన్ కు ఇప్పుడు ఒక భారీ విజయం అవసరం. ఇందు కోసం అతను చాలా కష్టపడుతున్నాడు. ఆమిర్ ఇంతకు ముందు నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’, ‘లాల్ సింగ్ చద్దా’ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. ఇప్పుడు ‘సితారే జమీన్ పర్’ చిత్రంతో మన ముందుకు వస్తున్నాడు. దీంతో నైనా హిట్ కొట్టాలనుకుంటున్నాడు ఆమిర్. కాబట్టి అభిమానులు కూడా ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే క్రమంలో ఆమిర్ ఖాన్ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ముంబై వీధుల్లో వడ పావ్ అమ్మాడీ స్టార్ హీరో.’సితారే జమీన్ పర్’లో ఆమిర్ ఖాన్, జెనీలియా దేశ్‌ముఖ్ తదితరులు నటించారు. చాలా మంది కొత్త కళాకారులకు ఈ మూవీలో అవకాశం లభించింది. ఆమిర్ ఖాన్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 20న విడుదల కానుంది. దీంతో ఆమిర్ ఖాన్ ప్రమోషన్లలో బిజి బిజీగా ఉంటున్నాడు.

వీడియో ఇదిగో..

‘సితారే జమీన్ పర్’ సినిమా ‘ఛాంపియన్స్’ సినిమాకి రీమేక్. ఈ సినిమా విడుదలకు ముందు ఆమిర్ ఖాన్ తన స్నేహితులను పిలిచి పార్టీ ఇచ్చారు. రణబీర్ కపూర్, సచిన్ టెండూల్కర్ తదితరులు ఈ పార్టీలో పాల్గొన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భార్య కళ్లెదుటే భర్త హత్య.. అసలు స్కెచ్ ఎవరిది!
భార్య కళ్లెదుటే భర్త హత్య.. అసలు స్కెచ్ ఎవరిది!
తెలంగాణలో కొత్త నవోదయ విద్యాలయాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్!
తెలంగాణలో కొత్త నవోదయ విద్యాలయాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్!
ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య భీకర యుద్దం.. రాజీకి రావాలని ట్రంప్ పిలుపు
ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య భీకర యుద్దం.. రాజీకి రావాలని ట్రంప్ పిలుపు
ఈ సీడ్స్ తింటున్నారా..? వీటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి..!
ఈ సీడ్స్ తింటున్నారా..? వీటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి..!
టీ అలవాటును కాస్త మార్చండి చాలు.. మీకు ఈ సమస్య ఉండదు..!
టీ అలవాటును కాస్త మార్చండి చాలు.. మీకు ఈ సమస్య ఉండదు..!
యోగాంధ్రకు సర్వం సిద్ధం.. ఏర్పాట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు!
యోగాంధ్రకు సర్వం సిద్ధం.. ఏర్పాట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు!
పనసపండుతో మొదలైన గొడవ.. తమ్ముడి ప్రాణం తీసే వరకు ఎలా వెళ్లింది?
పనసపండుతో మొదలైన గొడవ.. తమ్ముడి ప్రాణం తీసే వరకు ఎలా వెళ్లింది?
పిల్లలకు ఈ అలవాట్లు నేర్పితే.. మస్త్ స్ట్రాంగ్‌ గా ఉంటారు..!
పిల్లలకు ఈ అలవాట్లు నేర్పితే.. మస్త్ స్ట్రాంగ్‌ గా ఉంటారు..!
ఈ కూరగాయను తక్కువ అంచనా వేయకండి.. ఎన్నో రోగాలకు మందు ఇది..!
ఈ కూరగాయను తక్కువ అంచనా వేయకండి.. ఎన్నో రోగాలకు మందు ఇది..!
బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటే పోటెత్తిన జనం - ఆ తర్వాత
బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటే పోటెత్తిన జనం - ఆ తర్వాత