Amitabh Bachchan: షూటింగ్‌ సెట్‌లో బిగ్‌బీకి గాయం.. ఆస్పత్రికి తరలింపు.. డాక్టర్లు ఏమన్నారంటే?

సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉంటోన్న బిగ్‌బీ గాయపడ్డాడు. కేబీసీ షూటింగ్‌ సెట్‌లోనే ఆయనకు గాయం కాగా వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ విషయాన్ని అమితాబే​ తన బ్లాగ్‌ ద్వారా అభిమానులకు తెలియజేశారు.

Amitabh Bachchan: షూటింగ్‌ సెట్‌లో బిగ్‌బీకి గాయం.. ఆస్పత్రికి తరలింపు.. డాక్టర్లు ఏమన్నారంటే?
Amitabh Bachchan
Follow us
Basha Shek

|

Updated on: Oct 24, 2022 | 7:13 AM

ఇటీవలే 80వ వసంతంలోకి అడుగుపెట్టారు బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌. ఈ వయస్సులో కూడా వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంటున్నారు. ఇటీవల రణ్‌బీర్‌ కపూర్‌ బ్రహ్మాస్త్ర, రష్మిక గుడ్‌బై చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషించాడు. మరోవైపు హోస్ట్‌గా క్విజ్‌ రియాలిటీ షో కౌన్‌ బనేగా కరోడ్‌పతి సీజన్‌ -14 ను సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్నాడు. ఇలా సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉంటోన్న బిగ్‌బీ గాయపడ్డాడు. కేబీసీ షూటింగ్‌ సెట్‌లోనే ఆయనకు గాయం కాగా వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ విషయాన్ని అమితాబే​ తన బ్లాగ్‌ ద్వారా అభిమానులకు తెలియజేశారు. షో చేస్తున్న సమయంలో చిన్న ఇనుప ముక్క తన ఎడమ కాలికి తగిలి దెబ్బ తగిలిందని చెప్పారు బిగ్‌బీ. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. రక్త స్రావం కావడంతో కొన్ని కుట్లు కూడా వేశారని ఆయన తెలిపారు. ఇప్పుడు బాగానే ఉన్నాని.. అభిమానులు ఆందోళని చెందవ్దని కోరారు అమితాబ్‌. కాగా గాయం మానేందుకు యాంటిసెప్టిక్‌ మందులు ఇవ్వడంతో పాటు కొంతకాలం రెస్ట్‌ తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారట. ట్రెడ్‌మిల్ పై కూడా నడవొద్దని, ఒత్తిడికి దూరంగా ఉండాలని కూడా సూచించారట.

కాగా ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అమితాబ్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే..ప్రస్తుతం సూరజ్​ బర్జాత్యా దర్శకత్వం వహిస్తున్న ‘ఉంచాయి’ సినిమాలో నటిస్తున్నారు అమితాబ్‌. ఈ సినిమాలో నీనా గుప్తా, అనుపమ్​ ఖేర్, పరిణీతి చోప్రా, బోమన్​ ఇరానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నవంబర్​ 11న విడుదలయ్యే అవకాశాలున్నాయి. అలాగే పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటిస్తోన్న ప్రాజెక్టు-కే లోనూ కనిపించనున్నారీ లెజెండరీ స్టార్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!