Adipurush: పోస్టర్ అదిరిపోయింది కానీ ఫ్యాన్స్ ఇంకేదో కావాలంటున్నారు
కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ఐమాక్స్, త్రీడీ పార్మేట్ లో వచ్చే సంక్రాంతి పండగకు జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.
ఆదిపురుష్ చిత్రాన్ని పౌరాణిక గాథ రామాయణం నేపథ్యంతో దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. టీ సిరీస్, రెట్రోపైల్స్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మాణంలో భాగమయ్యారు. కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ఐమాక్స్, త్రీడీ పార్మేట్ లో వచ్చే సంక్రాంతి పండగకు జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్ విషయంలో పలు విమర్శలు వినిపించిన విషయం తెలిసిందే. ఇది బాలేదు.. అది బాలేదు అంటూ చాలా మంది చాలా విమర్శలు చేశారు. ఆ తర్వాత టీజర్ త్రీడీ లో చూసిన అభిమానులు మాత్రం సినిమా నెక్ట్స్ లెవల్ లో ఉండటం ఖాయం అని చెప్తున్నారు. టీజర్లో ఎక్కువగా గ్రాఫిక్స్ వాడారని కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. ఇక ఇప్పుడు మరోసారి ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశను వ్యక్తం చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా ఆది పురుష్ నుంచి స్పెషల్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేశారు. సీతమ్మను అపహరించిన రావణ సంహారం జరగాల్సిందేనని ప్రతిజ్ఞ చేసిన రాఘవుడు వానర సైన్యంతో కలిసి లంకపై దండెత్తిన అపూర్వ దృశ్యాన్ని గుర్తుచేసిందీ పోస్టర్. ఈ పోస్టర్ లో రాముడిగా పోతపోసినట్లు ప్రభాస్ కనిపించారు. రణక్షేత్రం వైపు దృష్టి సారించే ఆ చూపులు, లక్ష్యం వైపు వడిగా పడే ఆ అడుగులు, శత్రువును చీల్చేందుకు సిద్ధమైన విల్లంబులతో రాముడి కార్యదీక్షను ప్రభాస్ తన ఆహార్యంలో అద్భుతంగా చూపించారు.
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆది పురుష్ నుంచి విడుదల ఈ లుక్ అభిమానులను అలరిస్తోంది. అందరినీ ఆకట్టుకుంటున్న ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. అయితే కొందరు మాత్రం ఇంకా ఎక్స్పెట్ చేశాం అని అంటున్నారు. ఈ పోస్టర్ టీజర్ లో చూపించిన దానిలానే ఉంది అని. ఇంతకు మించి పోస్టర్ ఉంటుందని ఆశపడ్డాం అని అంటున్నారు. కొంతమంది ఈ ఫొటోలో ఎడిటింగ్ ఎక్కువైంది అని డార్లింగ్ నేచురల్ లుక్ అయితేనే అదిరిపోయేదని అంటూ కామెంట్స్ చేస్తున్నారు.