Amitabh Bachchan: ముసలోడా అన్న నెటిజన్ అదిరిపోయే రిప్లే ఇచ్చిన అమితాబ్.. ఏమన్నారంటే

బాలీవుడ్ సీనియర్ హీరో అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే.. ఛాన్స్ దొరికినప్పుడల్లా సినిమాలు చేస్తూ..

Amitabh Bachchan: ముసలోడా అన్న నెటిజన్ అదిరిపోయే రిప్లే ఇచ్చిన అమితాబ్.. ఏమన్నారంటే
Amitabh Bachchan
Follow us
Rajeev Rayala

|

Updated on: May 17, 2022 | 7:30 AM

బాలీవుడ్ సీనియర్ హీరో అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే.. ఛాన్స్ దొరికినప్పుడల్లా సినిమాలు చేస్తూ.. అలాగే రియాలిటీ గేమ్ షో కేసీబీ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బిగ్ బి ప్రతిరోజు అభిమానులను పలకరిస్తూ ఉంటారు. తాజాగా ఓ నెటిజన్ అమితాబ్ ను అవనపరిచే విధంగా కామెంట్ చేశాడు దానికి బిగ్ బి తనదైన శైలిలో రిప్లే ఇచ్చి అతడికి బుద్ధివచ్చేలా చేశారు. రీసెంట్ గా 11.30 గంట‌ల‌ ప్రాంతంలో గుడ్ మార్నింగ్ అంటూ అమితాబ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై పలువురు పాజిటివ్ గా రియాక్ట్ అవ్వగా కొంద‌రు ట్రోల్స్ మొద‌లెట్టారు. అందులో భాగంగానే ఓ నెటిజ‌న్ అత్యుత్సాహంతో ఇది మ‌ధ్యాహ్నం ముస‌లోడా” అంటూ కామెంట్ చేశాడు. దానిపై బిగ్ బి ఏమాత్రం సహనం కోల్పోకుండా సున్నితంగా రియాక్ట్ అయ్యారు.

త‌న‌ను ముస‌లోడా అంటూ కామెంట్ చేసిన నెటిజ‌న్‌కు కూడా ఓపిక‌గానే బ‌దులిచ్చారు. “మీరు చాలా కాలం బ్ర‌త‌కాల‌ని ప్రార్థిస్తున్నాను. అయితే మిమ్మ‌ల్ని ఎవ‌రూ ముస‌లోడు అని పిలిచి అవ‌మానించ‌కూడ‌ద‌ని కోరుకుంటున్నా” అంటూ ఆ నెటిజ‌న్‌కు బిగ్ బీ సమాధానం ఇచ్చారు. దాంతో అతడికి బుద్ధివాచేలా చేశారు. అమితాబ్ సమాధానం పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆన్సర్ సూపర్ అంటూ మరికొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఇక్కడ చదవండి : 

Keerthy Suresh: ఆడిపోయే ఫోజులతో కవ్విస్తున్న కళావతి.. లేటెస్ట్ పిక్స్ వైరల్

Sreemukhi: యెల్లో డ్రెస్ లో యాంకరమ్మ నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. శ్రీముఖి లేటెస్ట్ పిక్స్

Shamna Kasim: పింక్ శారీ లో పూర్ణ పరువాల విందు.. వైరల్ అవుతున్న షామ్నా లేటెస్ట్ పిక్స్