The Kerala Story: బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న కేరళ స్టోరీ మూవీ.. దాదాపు రూ. 150 కోట్లు వసూలు

ఈ ఏడాదిలో తక్కువ సమయంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో కేరళ స్టోరీ రెండవ స్థానానికి చేరుకుంది. గతంలో షారుఖ్‌ ఖాన్‌ నటించిన 'పఠాన్‌' చిత్రం అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా మొదటి ప్లేస్ లో నిలిచింది. కేరళ స్టోరీ వీకెండ్ లో కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో ఈ మూవీ విడుదలైన 11 రోజుల్లోనే టోటల్ గా నెట్ కలెక్షన్ దాదాపు 150 కోట్లకు వసూలు చేసింది.

The Kerala Story: బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న కేరళ స్టోరీ మూవీ.. దాదాపు రూ. 150 కోట్లు వసూలు
Kerala Story
Follow us
Surya Kala

|

Updated on: May 16, 2023 | 9:36 AM

సుదీప్తో సేన్ చిత్రం ‘ది కేరళ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ తో దూసుకుపోతుంది. రెండో వారాంతంలో ఈ సినిమా 150 కోట్లకు చేరువలో వసూళ్లు రాబట్టింది. కేరళ స్టోరీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. విడుదలైన రెండవ సోమవారం చక్కగా వసూళ్లు సాధించింది. ఈ ఏడాదిలో తక్కువ సమయంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో కేరళ స్టోరీ రెండవ స్థానానికి చేరుకుంది. గతంలో షారుఖ్‌ ఖాన్‌ నటించిన ‘పఠాన్‌’ చిత్రం అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా మొదటి ప్లేస్ లో నిలిచింది.

కేరళ స్టోరీ వీకెండ్ లో కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో ఈ మూవీ విడుదలైన 11 రోజుల్లోనే టోటల్ గా నెట్ కలెక్షన్ దాదాపు 150 కోట్లకు వసూలు చేసింది. విడుదలైన రెండో సోమవారం ఈ సినిమా రెండంకెల వసూళ్లు రాబట్టింది. సోమవారం ఈ సినిమా 10.5 కోట్లు రాబట్టింది. కేరళ స్టోరీ ముంబై సర్క్యూట్‌లో భారీ బిజినెస్ చేస్తోంది. అదే సమయంలో.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ చిత్రం తన సత్తాను కొనసాగిస్తోంది.

ఇవి కూడా చదవండి

ది కేరళ స్టోరీ 200 కోట్ల మార్క్ ని క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాల నిపుణుల అంచనా వేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా రోజు రోజుకీ ఆదరణ పెరిగిపోతుంది.. దీంతో వసూళ్లు నానాటికీ పెరుగుతున్నాయని.. కేరళ స్టోరీ ఈజీగా 250 కోట్ల మార్క్ ని టచ్ చేస్తుందనని భావిస్తున్నారు. దీంతో కేరళ స్టోరీ ఈ సంవత్సరంలో రెండవ అతిపెద్ద బాలీవుడ్ చిత్రం అవుతుంది.

అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన ది కేరళ స్టోరీ మూవీ అలియా భట్ నటించిన గంగూబాయి కతియావాడిని వసూళ్ల పరంగా వెనక్కి నెట్టింది. ఇప్పుడు ఈ సినిమా వసూళ్ల పరంగా కంగనా రనౌత్ నటించిన ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ని వెనక్కు నెట్టేందుకు సిద్ధమైంది. ఈ విధంగా కేరళ స్టోరీ అత్యధిక వసూళ్లు రాబట్టిన హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీగా రికార్డులకెక్కబోతోంది.

అదే సమయంలో ఇతర దేశాల్లోనూ ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. ఆస్ట్రేలియాలో ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్త కలెక్షన్లను పరిశీలిస్తే, వివేక్ అగ్నిహోత్రి చిత్రం ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సమానంగా ది కేరళ కథ సినిమా వసూళ్లను రాబట్టే దిశగా అడుగులు వేస్తోంది.ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ  గతేడాది 340 కోట్లకు పైగా రాబట్టిన సంగతి తెలిసిందే..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే