Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rati Agnihotri: ఆ స్టార్ హీరో అంటే పిచ్చి ప్రేమ.. కానీ తండ్రి మాటతో వేరే పెళ్లి చేసుకున్న హీరోయిన్.. 30 ఏళ్లు భర్త చిత్రహింసలు..

తండ్రి మాట కోసం ప్రేమించిన వ్యక్తిని వదిలి.. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుని దాదాపు 30 ఏళ్లు భర్త చేతిలో చిత్రహింసలు అనుభవించింది ఓ హీరోయిన్. ప్రస్తుతం ఆమె వయసు 62 ఏళ్లు. ఇప్పటికీ అలనాటి రోజుల్లో ప్రేక్షకుల మనసులో నిలిచిపోయిన రూపమే. తనే బాలీవుడ్ బ్యూటీ రతీ అగ్నిహోత్రి.

Rati Agnihotri: ఆ స్టార్ హీరో అంటే పిచ్చి ప్రేమ.. కానీ తండ్రి మాటతో వేరే పెళ్లి చేసుకున్న హీరోయిన్.. 30 ఏళ్లు భర్త చిత్రహింసలు..
Rathi Agnihotri
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 16, 2023 | 9:08 AM

హీరోయిన్‏గా వెండితెరపై ఓ వెలుగు వెలగాలని ఎన్ని కలలతో సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతుంటారు. చిన్న వయసులోనే సినీరంగ ప్రవేశం చేసి స్టార్ డమ్ సంపాదించి.. అంతలోనే ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. అనుకోని దారిలో ఎదురైన సంఘటనలతో జీవితం తలకిందులై దిక్కుదోచని స్థితికి చేరుకున్న నటీనటుల గురించి వింటుంటాం. ఇక పరిశ్రమలో కథానాయికలు.. పలువురి స్టార్స్ ప్రేమలో పడి కెరియర్ నాశనం చేసుకున్నవారి గురించి విన్నాం. కానీ తండ్రి మాట కోసం ప్రేమించిన వ్యక్తిని వదిలి.. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుని దాదాపు 30 ఏళ్లు భర్త చేతిలో చిత్రహింసలు అనుభవించింది ఓ హీరోయిన్. ప్రస్తుతం ఆమె వయసు 62 ఏళ్లు. ఇప్పటికీ అలనాటి రోజుల్లో ప్రేక్షకుల మనసులో నిలిచిపోయిన రూపమే. తనే బాలీవుడ్ బ్యూటీ రతీ అగ్నిహోత్రి.

1960 డిసెంబర్ 10న యూపీలోని బరేలీలో జన్మించింది. తన తండ్రి ఉద్యోగం కారణంగా చిన్నతనంలోనే తమిళనాడుకు మారాల్సి వచ్చింది. చిన్నతనం నుంచే నటనపై ఉన్న ఆసక్తితో.. కేవలం పది సంవత్సరాల వయస్సులోనే మోడలింగ్ ప్రారంభించింది. 20 ఏళ్ల వయసులోనే తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తమిళంతోపాటు.. హిందీలోనే అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. హీరోయిన్‏గా కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే ఆమె.. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్‏ను పిచ్చిగా ప్రేమించింది. కానీ అతడిని పెళ్లి చేసుకోవడానికి ఆమె తండ్రి అంగీకరించలేదు. దీంతో 25 ఏళ్ల వయసులో రతీ ఓ వ్యాపారవేత్త అయిన అనిల్ విర్వానీని రహస్యంగా వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత దాదాపు 13 ఏళ్ల పాటు వెండితెరకు దూరంగా ఉంది. ఆ తర్వాత ఆమె జీవితం ఊహించని మలుపు తిరిగింది.

ఇవి కూడా చదవండి

దక్షిణాది స్టార్ డైరెక్టర్ భారతీ రాజా.. తన కొత్త సినిమా కోసం హీరోయిన్ ను వెతుకుతున్నాడు. అప్పుడు 19 ఏళ్ల వయసులోనే 1979లో తమిళ్ చిత్రం పుధియా వార్పుకల్ విడుదలైంది. కేవలం రెండేళ్లలోనే దాదాపు 15 తమిళ్, తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించి స్టార్‌డమ్‌ని సంపాదించుకుంది రతీ.1981లో వచ్చిన ‘ఏక్ దూజే కే లియే’ చిత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో కమల్ హాసన్, రతీ అగ్నిహోత్రిల ప్రేమకథ ఇప్పటికీ ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది. ఈ చిత్రానికి గానూ రతీ ఫిలింఫేర్ ఉత్తమ నటిగా నామినేట్ అయింది. అదే ఏడాది సంజయ్ దత్ నటించిన రాకీ చిత్రం కూడా విడుదలైంది. తొలి చిత్రంతోనే సంజయ్ స్టార్ అయ్యాడు. అయితే సంజయ్ నిత్యం చాలా మంది నటీమణులతో ప్రేమాయణం వార్తలు అప్పట్లో ఫిల్మ్ సర్కిల్లో వినిపించేవి. అయినా.. అతడిని పిచ్చిగా ప్రేమించింది. ఆ సమయంలో సినీ కెరీర్ వదిలేసి డ్రగ్స్ అడిక్షన్ తో బాధపడుతున్న సంజయ్ దత్ ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యింది. కానీ ఆమె తండ్రి అందుకు ఒప్పుకోలేదు. అయితే ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ విర్వానీతో వివాహం తర్వాత దాదాపు 30 ఏళ్ల పాటు అతని చేతిలో మానసిక వేధింపులకు గురయ్యింది. వీరి గొడవలు పోలీస్ స్టేషన్ కు చేరాయి. 2015లో రతి తన భర్త నుంచి విడిపోయింది.