Tollywood: అమ్మ ఒడిలో కూర్చుని చిరునవ్వులు చిందిస్తోన్న ఈ పాలబుగ్గల చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. నార్త్ టూ సౌత్ అల్లాడించేస్తోంది..

ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా ?.. గతేడాది పెళ్లి బంధంతో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు ఇటీవల పాపకు జన్మనిచ్చింది. ఎవరో గుర్తుపట్టండి.

Tollywood: అమ్మ ఒడిలో కూర్చుని చిరునవ్వులు చిందిస్తోన్న ఈ పాలబుగ్గల చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. నార్త్ టూ సౌత్ అల్లాడించేస్తోంది..
Actress
Follow us

|

Updated on: Mar 16, 2023 | 10:03 AM

పైన ఫోటోలో అమ్మ ఒడిలో హాయిగా కూర్చుని చిరునవ్వులు చిందిస్తోన్న ఆ పాలబుగ్గల చిన్నారి ఎవరో గుర్తుపట్టరా ?. నార్త్ టూ సౌత్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి వచ్చినా.. నటనతో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఆనతి కాలంలోనే బాలీవుడ్ టూ టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా ?.. గతేడాది పెళ్లి బంధంతో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు ఇటీవల పాపకు జన్మనిచ్చింది. ఎవరో గుర్తుపట్టండి.

ఆ చిన్నారి మరెవరో కాదు..బాలీవుడ్ బ్యూటీ అలియా భట్. 1993 మార్చి 15న బాలీవుడ్ ప్రొడ్యూసర్ మహేష్ భట్, సోనీ రజ్దాన్ దంపతులకు జన్మించింది అలియా. 1999లో విడుదలైన హిందీ చిత్రం సంఘర్ష్ చిత్రంలో బాలనటిగా కనిపించింది. ఆ తర్వాత 2012లో విడుదలైన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రంతో కథానాయికగా బిగ్ స్క్రీన్ పైకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న అలియా.. ఆ తర్వాత వరుస చిత్రాలోత బిజీ అయ్యింది.

ఇవి కూడా చదవండి

హైవే, షాందార్, కపూర్ అండ్ సన్స్, డియర్ జిందగీ, ఊడ్త పంజాబ్, రాజీ, సడక్ 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక తెలుగులో డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన సెన్సెషనల్ హిట్ చిత్రం ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో సీత పాత్రలో అలియా ఎంతో అందంగా నటించింది. అలాగే లేడీ ఓరియెంటెడ్ చిత్రం గంగూబాయి కతియావాడి చిత్రంతో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. గతేడాది ఏప్రిల్ 14న తన ప్రియుడు రణబీర్ కపూర్ ను వివాహం చేసుకుంది. వీరికి నవంబర్ 6న పాప జన్మించింది. ప్రస్తుతం అలియా సినిమాలకు దూరంగా ఉంటుంది.

View this post on Instagram

A post shared by Alia Bhatt ? (@aliaabhatt)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.