- Telugu News Photo Gallery Cinema photos Actress Sara Ali Khan enjoys Manali trip shares latest photos from vacation venue
Sara Alikhan: సమ్మర్ వెకేషన్‌లో స్టార్ హీరోయిన్.. చిల్ అవుతోన్న సారా అలీఖాన్.. ఫొటోలు వైరల్
సైఫ్ అలీ ఖాన్ కుమార్తె, నటి సారా అలీ ఖాన్ వెకేషన్ మూడ్‌లో ఉంది. ప్రస్తుతం ఆమె మనాలీ టూర్‌లో ఎంజాయ్ చేస్తోంది. తాజాగా తన వెకేషన్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది సారా.
Updated on: Mar 15, 2023 | 10:12 PM

సైఫ్ అలీ ఖాన్ కుమార్తె, నటి సారా అలీ ఖాన్ వెకేషన్ మూడ్‌లో ఉంది. ప్రస్తుతం ఆమె మనాలీ టూర్‌లో ఎంజాయ్ చేస్తోంది. తాజాగా తన వెకేషన్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది సారా

మనాలిలోని స్విట్జర్లాండ్‌తో పోల్చింది సారా. ఆమెతో పాటు ఆమె తల్లి మరియు ప్రముఖ నటి అమృతా సింగ్ కూడా మనాలీలో సమ్మర్ హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

సారా సోదరుడు ఇబ్రహీం అలీ ఖాన్ తన మొదటి సినిమా సర్జామీన్ షూటింగ్ కోసం దాదాపు ఒక నెల పాటు మనాలిలోనే ఉంటున్నాడు. ఈక్రమంలో తన సోదరుడిని చూడడానికి, అలాగే మనాలీ అందాలను వీక్షించడానికి వచ్చింది సారా.

తన వేకేషన్‌కు సంబంధించిన తాజా చిత్రాలను షేర్ చేస్తూ.. ' మనాలిలో నేను, నా మనసు' అనే క్యాప్షన్ ఇచ్చింది సారా. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక సినిమాల విషయానికొస్తే.. సారా అలీ ఖాన్ నటించిన గ్యాస్‌లైట్ మార్చి 31, 2023న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఈ సినిమాలో సారా రాహుల్ దేవ్, అక్షయ్ ఒబెరాయ్‌లతో స్క్రీన్ షేర్ చేసుకోనుంది.




