Hema Malini : అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంలో అందాల తార.. ప్రత్యేక నృత్య ప్రదర్శన ఇవ్వనున్నహేమ మాలిని
జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది . ఇందుకోసం అన్ని ఏర్పాట్లు వేడుకగా జరుగుతున్నాయి. రామమందిర ప్రారంభోత్సవానికి ముందు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది . ఇందుకోసం అన్ని ఏర్పాట్లు వేడుకగా జరుగుతున్నాయి. రామమందిర ప్రారంభోత్సవానికి ముందు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే ఈ చారిత్రాత్మక ఘట్టంలో పలువురు సెలబ్రిటీలు భాగం కానున్నారు. ముఖ్యంగా సినీ ప్రముఖులకు పెద్ద ఎత్తున ఆహ్వానాలు వెళ్లాయి. వీరిలో కొంతమంది ప్రముఖులు అయోధ్యలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జనవరి 17న రామాయణ కథ ఆధారంగా హేమమాలిని నృత్య ప్రదర్శన చేయనున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఆమెనే స్వయంగా పంచుకున్నారు. ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేసిన ఆమె.. ‘రామమందిర నిర్మాణం కోసం ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. రామప్రాణ ప్రతిష్టాపన సమయానికి మొదటిసారిగా అయోధ్యకు వస్తున్నాను. జనవరి 17న రాత్రి 7 గంటలకు నా బృందంతో కలిసి అయోధ్యధామంలో రామాయణం ఆధారంగా నాట్య ప్రదర్శన చేయబోతున్నాను’ అంటూ అయోధ్యకు వచ్చే అందరికీ స్వాగతం పలికారు హేమమాలిని.
రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రముఖ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే పలువురి ఇళ్లకు ఆహ్వాన పత్రిక చేరింది. చిరంజీవి, రజనీకాంత్, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, ప్రభాస్, అలియా భట్, రణబీర్ కపూర్, సన్నీ డియోల్, ఆయుష్మాన్ ఖురానా, అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, యష్, అనుపమ్ ఖేర్, మాధురీ దీక్షిత్ తదితరులకు అయోధ్య నుంచి ఆహ్వానాలు అందాయి. అలాగే డైరెక్టర్లు రోహిత్ శెట్టి, సంజయ్ లీలా భన్సాలీ, రాజ్ కుమార్ హిరానీ, రిషబ్ శెట్టి, మోహన్‌లాల్, ధనుష్ వంటి ప్రముఖులకు ఆహ్వానం అందినట్లు సమాచారం. జనవరి 22 న జరిగే ఈ మహాక్రతువు కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా ఏర్పాట్లు జరగనున్నాయి. నేటి నుంచి రామలల్ల మహామస్తకాభిషేక పూజలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుక కోసం అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రాయశ్చిత్త పూజతో రామమందిర ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
హేమ మాలినీ రిలీజ్ చేసిన వీడియో..
#WATCH | BJP leader Hema Malini says, “…I am coming to Ayodhya for the first time at the time of the ‘pranpratishtha’ of Ram Temple for which people were waiting for years…On January 17, I’ll be presenting a dance drama based on Ramayana in Ayodhya Dham…”
(Source: Hema… pic.twitter.com/TjY34WTFNO
— ANI (@ANI) January 14, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..