టాలీవుడ్ టాప్ కమెడియన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన శ్రీలీల

11 January 2025

Basha Shek

 టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో ఎనలేని పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్లలో శ్రీ లీల ముందుంటుంది.

అయితే ఆ మధ్యన వరుసగా పరాజయాలు అందుకుందీ అందాల తార. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిందీ అందాల తార.

కానీ ఇటీవల అల్లు అర్జున్- సుకుమార్ కాంబో మూవీ పుష్ప 2 'కిస్సిక్' సాంగ్ లో మాస్ స్టెప్పులు వేసి మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

ఈ స్పెషల్ సాంగ్ తో ఈ అమ్మడు కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయింది. ఇప్పుడు ఈ బ్యూటీకి బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి.

ఇదిలా ఉంటే శ్రీలీల సీనియర్ నటుడు, స్టార్ కమెడియన్ బ్రహ్మాజీకి వార్నింగ్ ఇచ్చింది. అయితే ఇది సీరియస్‌గా ఇచ్చిన వార్నింగ్ కాదు.

పుష్ప2 సినిమాలో కిస్సిక్ సాంగ్‌కు శ్రీలీల, బ్రహ్మాజీ కలిసి ఇటీవల రీల్స్ చేశారు. ఇందులో బ్రహ్మాజీ కూర్చొని వీడియో తీశాడు.

మరోవైపు శ్రీలీల తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో దెబ్బలు పడతాయి అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా  ప్రస్తుతం శ్రీలీల చేతిలో పవన్ కల్యాణ్, నితిన్, రవితేజ తో పాటు పలువురు స్టార్ హీరోల సినిమాలున్నాయి.