Amitabh Bachchan: అయోధ్యలో రామ మందిరం దగ్గర్లో భూమికొన్న అమితాబ్.. ఎన్ని కోట్లంటే..
ఈనెల 22న ఆలయంలో రాముడి ప్రాణప్రతిష్టాపన జరగనుంది. ఈ కార్యక్రమంలో దేశంలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపావేత్తలు, వివిధ ప్రాంతాల ప్రజలు హాజరుకానున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లకు సైతం రామమందిర ఆహ్వానం అందుకున్నారు. అటు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ కూడా ఈ వేడుకలలో పాల్గొననున్నారు. అయితే ఈ వేడుకకు ముందే అమితాబ్ అయోధ్యలో సొంతింటి నిర్మాణానికి
ప్రస్తుతం దేశం మొత్తం రామనామం మారుమోగుతుంది. అటు శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తైంది. ఈనెల 22న ఆలయంలో రాముడి ప్రాణప్రతిష్టాపన జరగనుంది. ఈ కార్యక్రమంలో దేశంలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపావేత్తలు, వివిధ ప్రాంతాల ప్రజలు హాజరుకానున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లకు సైతం రామమందిర ఆహ్వానం అందుకున్నారు. అటు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ కూడా ఈ వేడుకలలో పాల్గొననున్నారు. అయితే ఈ వేడుకకు ముందే అమితాబ్ అయోధ్యలో సొంతింటి నిర్మాణానికి అడుగు ముందుకేశారు. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం అయోధ్యలో ఇల్లు కట్టుకోవడానికి రామమందిరం దగ్గర్లో బిగ్ బీ స్థలాన్ని కొన్నాడట. ముంబైకి చెందిన డెవలపర్ ‘ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా (HoABL)’ ద్వారా అమితాబ్ బచ్చన్ అయోధ్యలోని సెవెన్ స్టార్స్ ఎన్‌క్లేవ్ అయిన ది షర్యులో ఒక ప్లాట్‌ను కొనుగోలు చేశారు.
రామమందిరం ‘ప్రాణ్ ప్రతిష్ట’ వేడుకకు ముందు, అమితాబ్ బచ్చన్ అయోధ్యలో ఇల్లు నిర్మించడానికి 14.5 కోట్ల రూపాయల విలువైన ప్లాట్‌ను కొనుగోలు చేశారు. మీడియా నివేదికల ప్రకారం అమితాబ్ బచ్చన్ సుమారు 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, రూ. 14.5 కోట్లతో ఒక ఇంటిని నిర్మించనున్నట్లు సమాచారం. 2028 నాటికి అమితాబ్ ఇల్లు పూర్తి కానుంది. రానున్న రోజుల్లో అయోధ్యలో పర్యాటకుల సంఖ్య పెరగనుంది . ఈ సందర్భంలో, భూమి ధర పెరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అమితాబ్ బచ్చన్ పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. అమితాబ్ కొన్న భూమి రామమందిరానికి కేవలం 15 నిమిషాల దూరంలో ఉంది. అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 30 నిమిషాలలో ఈ ప్రదేశానికి చేరుకోవచ్చు. జనవరి 22న రామజన్మభూమిలో అత్యంత వైభవంగా ఆలయాన్ని ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ.
ఇటీవల ఒక కార్యక్రమంలో అమితాబ్ మాట్లాడుతూ.. “నేను అయోధ్యలోని సరయులో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాలని ఎదురుచూస్తున్నాను. ఈ నగరానికి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. సంప్రదాయం, ఆధునికత కలిసి ఉండే అయోధ్య. నేను ప్రపంచ ఆధ్యాత్మికత మధ్యలో ఒక ఇంటిని నిర్మించబోతున్నాను” అని అన్నారు. అమితాబ్ పూర్వీకుల ఇల్లు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉంది. ప్రయాగరాజ్ అయోధ్య నుండి నాలుగు గంటల దూరంలో ఉంది. నరేంద్ర మోదీ, అమితాబ్ బచ్చన్‌తో పాటు 3000 మంది వీఐపీలు రామమందిర ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఈ వేడుకలో బాలీవుడ్ అక్షయ్ కుమార్, కంగనా రనౌత్, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, రతన్ టాటా, గౌతమ్ అదానీ తదితరులు పాల్గొననున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.